రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే ఈయన సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు పెట్టిన లేదా ఎలాంటి వ్యాఖ్యలు చేసిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే సమాజంలో జరిగే ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు డ్రగ్స్ కేసు గురించి కూడా స్పందించారు.గత ఏడాది అక్టోబర్ నెలలో క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఉపయోగించారని
ఆరోపణలతో ఎన్‌సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు ఆర్యన్ ఖాన్ ను దాదాపు నెల రోజుల పాటు తమ కస్టడీలో బంధించారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చిన ఆర్యన్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది.తాజాగా ఎన్‌సీబీ అధికారులు దర్యాప్తులో భాగంగా కోర్టుకు చార్జిషీట్ సమర్పించిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ చార్జిషీట్లో భాగంగా ఆర్యన్ ఖాన్ అమాయకుడని తను ఎలాంటి డ్రగ్స్ తీసుకోవడం లేదని పేర్కొనడమే కాకుండా, ఈ చార్జిషీట్లో తన పేరును తొలగిస్తూ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయంపై వర్మ స్పందిస్తూ తనదైనశైలిలో కామెంట్ చేశారు. అమాయకులను దర్యాప్తు ఏజెన్సీలు ఎలా ఇబ్బందులకు గురి చేస్తాయో ఈ కేసు వెల్లడించిందని ఈయన తెలియజేశారు.
ఒక సెలబ్రిటీ కుమారుడు విషయంలో దర్యాప్తు ఏజెన్సీల అసమర్థత బయటపడిందని, అమాయకులను దర్యాప్తు ఏజెన్సీలు ఎలా ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ కేసు ద్వారా ప్రజలకు అర్థం అయిందని ఈ సందర్భంగా వర్మ దర్యాప్తు ఏజెన్సీలపై తనదైన శైలిలో చురకలంటించారు.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!