RGV,Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో సినిమాలపై కన్నా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈయన ఎక్కువగా బయోపిక్ చిత్రాలు అలాగే విభిన్న కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తరచూ వివాదాలలో నిలుస్తున్నారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఈ క్రమంలోనే ఇంటర్వ్యూ సందర్భంగా రాంగోపాల్ వర్మ తాను మెగాస్టార్ చిరంజీవి గురించి ఎప్పుడూ ఎలాంటి సెటైర్స్ వేయలేదని తాను మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఏం మాట్లాడినా ఒక అభిమానిగానే మాట్లాడానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వర్మ మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి వర్మ మాట్లాడుతూ.. రామ్ చరణ్ జెంటిల్మెన్.. ఆయన చాలా పర్ఫెక్ట్ అంటూ రాంచరణ్ గురించి మాట్లాడారు.

రామ్ చరణ్ ఎలాంటి గొడవలకు వెల్లే వ్యక్తి కాదని, అలా ఎలాంటి గొడవలు లేకుండా ఉండడం చాలా బోరింగ్ అంటూ ఈయన కామెంట్స్ చేశారు. ఇలా సడన్ గా రాంగోపాల్ వర్మ రామ్ చరణ్ గురించి కామెంట్లు చేయడంతో మెగా ఫాన్స్ వర్మ మాటలలో ఏదో తేడా కొడుతుంది అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

మెగా ఫ్యామిలీ అంటే ఇంత ఎత్తున లేచే వర్మ ఇలా మెగా ఫ్యామిలీ గురించి ప్రశంసలు కురిపిస్తుండడంతో వర్మ వ్యవహారం ఏదో తేడాగా ఉందని భావిస్తున్నారు. మొత్తానికి రామ్ చరణ్ గురించి వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus