విరాట్ బయోపిక్ చిత్రంపై రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

రామ్ పోతినేని త్వరలోనే స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రామ్ తన సినిమాలకు హిందీలో డబ్బింగ్ చెప్పే సంకేత్ తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సంకేత్ రామ్ ను ప్రశ్నిస్తూ ఆయననుంచి ఎన్నో సమాధానాలు రాబట్టారు.

ముఖ్యంగా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి పలు ప్రశ్నలు అడిగారు రామ్ పోతినేని విరాట్ కోహ్లీ పోలికలతో ఉంటారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విరాట్ కోహ్లీతో పోలుస్తూ కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే సంకేత్ ఈ విషయం గురించి రామ్ ను ప్రశ్నించారు. మీరు చూడటానికి విరాట్ కోహ్లీ లాగా ఉంటారు అంటూ కామెంట్లు వస్తుంటాయి. ఎప్పుడైనా చూసారా అంటూ ప్రశ్నించడంతో తాను నటిస్తున్నటువంటి ఈ స్మార్ట్ శంకర్ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ విధమైనటువంటి వార్తలు రావడం మొదలయ్యాయి అంటూ రామ్ తెలిపారు.

మరి ఆయన పోలికలతో ఉన్నటువంటి మీరు ఆయన బయోపిక్ చిత్రంలో నటిస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ విరాట్ కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలి అంటే ఎక్సైటింగ్ గానే ఉంటుంది కదా ఆ అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ ఈ సందర్భంగా రామ్ సమాధానం చెప్పారు. మరి నిజంగానే విరాట్ కోహ్లీ బయోపిక్ సినిమా చేసే అవకాశం రామ్ కి వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే ఇప్పటికే ఈ బయోపిక్ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి గతంలో కూడా రామ్ చరణ్ పలు విషయాలు వెల్లడించారు. మరి ఈ అవకాశం హీరో రామ్ కి వస్తుందా లేక చరణ్ కి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus