Hero Ram: రామ్ సినిమాలో రెండు గెటప్స్ పై క్లారిటీ!

ఎనర్జటిక్ హీరో రామ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘ది వారియర్’. లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. గురువారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్.. సత్య అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటివరకు రామ్ పోలీస్ గెటప్ లో ఉన్న పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో కూడా రామ్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో విలన్స్ ని చితక్కొడుతూ కనిపించారు.

అయితే ఈ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే.. ఇందులో రామ్ డాక్టర్ కూడా. ఒకే వ్యక్తి డాక్టర్, పోలీస్ ఎలా అవుతాడు..? అనుకుంటున్నారా..? అదే ఈ సినిమాలో ట్విస్ట్. ఈ కథలో రామ్ డాక్టరే అయినప్పటికీ.. తన ముందు జరిగిన అన్యాయాన్ని డాక్టర్ గా ఎదుర్కోలేకపోతాడు. అదే పోలీస్ గా మారితే.. సమాజాన్ని మార్చొచ్చు అనే నిర్ణయం తీసుకొని పోలీస్ ఆఫీసర్ గా మారతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా కథ.

ట్రైలర్ లో డాక్టర్ మాదిరి రామ్ ప్రిస్కిప్ష‌న్ చదివే సన్నివేశాలు ఉంటాయి. అది ఈ సినిమాలో రామ్ మేనరిజం. అయితే రామ్ డాక్టర్ గెటప్ ని మాత్రం ఇప్పటివరకు రివీల్ చేయలేదు. దాన్ని సస్పెన్స్ గా ఉంచింది టీమ్. మరి రెండు గెటప్స్ లో రామ్ ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా రీచ్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు దర్శకనిర్మాత. ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత రామ్ కి మళ్లీ ఆ రేంజ్ హిట్ రాలేదు. ఈ సినిమాతో అలాంటి సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus