Ram , Trivikram: ‘డబుల్ ఇస్మార్ట్‌’ తర్వాత రామ్‌ సినిమా ఎవరితో? గురూజీ ఓకే అంటారా?

మీకో రెండు ప్రశ్నలు వేస్తాం? ఆ రెండింటికీ మీరు సరైన ఆన్సర్‌ చెప్పలేరు. అలా చెప్పలేకపోవడమే ఈ వార్త అని చెప్పొచ్చు. ముందు ప్రశ్నలు చెప్పేస్తాం.. ఆ తర్వాత ఆన్సర్‌ చెప్పేయొచ్చు. అదేనండీ ఏ సినిమా గురించి మేము చెబుతున్నామో మీకు తెలిసిపోతుంది. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) సినిమా తర్వాత రామ్‌ (Ram)  చేయబోయే సినిమా ఏంటి? ఇది మొదటి ప్రశ్న.. ఇక రెండో ప్రశ్న చూస్తే ‘త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram)  తర్వాత చేయబోయే సినిమా ఏంటి?

ఏంటీ.. ఈ రెండు ప్రశ్నలకూ మీకు సరైన ఆన్సర్‌ తెలియడం లేదా? అదే మేం పైన చెప్పిన విషయం. ఈ ఇద్దరూ నెక్స్ట్‌ ఏ సినిమా చేస్తారు అనేది తెలియడం లేదు. దీంతో ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తారు అనే డౌట్‌ పుకారు బయటికొచ్చింది. మహేష్‌బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  సినిమా విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు.

అల్లు అర్జున్‌తో (Allu Arjun) త్రివిక్రమ్‌ సినిమా ఉంటుంది అని చెప్పారు కానీ ఇంకా పూర్తి స్థాయి ప్రకటన, వివరాలు ఇంతవరకు రాలేదు. అయితే అది చాలా పెద్ద ప్రాజెక్ట్‌ కాబట్టి టైమ్‌ పడుతుంది అని అంటున్నారు. పాన్‌ ఇండియా రేంజిలో ఇప్పటివరకు తెలుగు హీరోలు చేయని తరహా సినిమా అంటున్నారు. మొత్తం పనులు అయ్యేలోపు త్రివిక్రమ్‌ కొత్త సినిమా ఒకటి చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. చాలామంది హీరోల పేర్లు వినిపించినా ఇంకా ఏదీ ఓకే కాలేదు.

ఇక రామ్‌ పరిస్థితీ దాదాపు ఇలానే ఉంది. అందుకే నిర్మాత స్రవంతి రవికిషోర్‌ (Sravanthi Ravi Kishore) రామ్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఓకే చేయించే పనిలో ఉన్నారట. ఇద్దరితో ‘అఆ’ (A Aa) తరహా కూల్‌ సినిమా చేయించాలని అనుకుంటున్నారట. ఈ లెక్కన మాస్ ఇమేజ్‌కి దగ్గరగా ఉండిపోయిన రామ్‌ను ఇటువైపు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట. మరి రామ్‌- త్రివిక్రమ్‌ కాంబో కుదురుతుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus