ఇంతకీ రామ్ కి మూవీ అంటే ఫ్యాషనా లేక వ్యాపారమా?

  • May 19, 2020 / 03:09 PM IST

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులు సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా కోట్లు కుమ్మరించి సినిమాలు తెరకెక్కించే నిర్మాతలు సంచలనాత్మక అడుగులు వేసేలా చేస్తుంది. సమీప కాలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడి థియేటర్స్ తెరుచుకునే మార్గం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది నిర్మాతలు ఓ టి టి ద్వారా తమ సినిమాలు విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. తమిళ చిత్రం ఫోన్ మగళ్ వండాళ్ చిత్రాన్ని నిర్మాత సూర్య అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు.

ఈ మూవీ ఈనెల 29నుండి ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. అలాగే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ పెంగ్విన్ సైతం ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేస్తున్నారు. కాగా హీరో రామ్ దర్శకుడు కిషోర్ తిరుమలతో రెడ్ అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ సినిమా సైతం ఓ టి టి ద్వారా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ట్విట్టర్ వేదికగా రామ్ చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి.

రామ్ ట్విట్టర్ లో సినిమా అనేది కొందరికి ఫ్యాషన్, చాలా మందికి బిజినెస్…మిగిలిన వారికి అది జూదం అని పోస్ట్ పెట్టారు. రామ్ చెవుతుంది నిజమే కానీ ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టం కాలేదు. సినిమా ప్యాషన్ అని భావిస్తే దానిని ఓ టి టి లో విడుదల చేయడానికి ఒప్పుకోరు, ఒకవేళ వ్యాపారం, జూదం అనుకుంటే ఓ టి టి వైపు మొగ్గుతారని ఆయన అంటున్నారా అనేది తెలియదు. చూద్దాం రెడ్ నిర్మాతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus