Ram Pothineni: వారియర్ కోసం రామ్ మేకోవర్..!

టాలీవుడ్ యంగ్ హీరోలు సిక్స్ ప్యాక్ లుక్ కోసం చాలా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు అదొక ట్రెండ్ అయిపోయింది. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ కూడా సిక్స్ ప్యాక్ లుక్ తో అలరించారు. యంగ్ హీరోలు సైతం సరికొత్త మేకోవర్ తో షాకిచ్చారు. చాక్లెట్ బాయ్‌లా కనిపించే రామ్ సైతం ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం తన లుక్ ను మార్చుకున్నాడు.

రఫ్ గా కనిపిస్తూనే.. సిక్స్ ప్యాక్ బాడీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా చివర్లో బేర్ బాడీతో ఫైట్ సన్నివేశాల్లో కూడా నటించాడు రామ్. ఇప్పుడు మరోసారి తన కొత్త సినిమా కోసం ఈ ఫీట్ రిపీట్ చేయబోతున్నాడట. తమిళ దర్శకుడు లింగుస్వామితో కలిసి ‘ది వారియర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు రామ్.

ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. తొలిసారి రామ్ పోలీస్ గెటప్ లో కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ రోల్ కోసం రామ్ శారీరకంగా చాలా కష్టపడ్డాడట.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తరువాత ‘రెడ్’ సినిమా కోసం కాస్త బరువు పెరిగాడు రామ్. ఇప్పుడు ‘ది వారియర్’ కోసం నాలుగు నెలలపాటు కష్టపడి ఫిజిక్ ను పెర్ఫెక్ట్ షేప్ లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’కి మించి ఇందులో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తాడట రామ్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus