Ram Pothineni: వెబ్‌సిరీస్‌కి రామ్ ఓకే చెప్పాడా? ఆ ఓటీటీలోనే త్వరలో!
- May 11, 2024 / 12:07 PM ISTByFilmy Focus
సినిమా హీరోలు, హీరోయిన్లు ఓటీటీల్లోకి రావడం కొత్తేమీ కాదు. గత కొన్ని ఏళ్లుగా ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. కొంతమంది వెబ్‌సిరీస్‌లతో, మరికొంతమంది సినిమాలతో, ఇంకొంతమంది టాక్ షోలో ఓటీటీలవైపు వస్తున్నారు. తాజాగా మరో స్టార్ హీరో ఓటీటీ బాట పడుతున్నాడు. సినిమాల్లో ట్రాక్ కాస్త గందరగోళంగా ఉన్న ఆ హీరో.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో సిరీస్ ప్రారంభమవుతుంది అంటున్నారు.
గందరగోళంలో ఉన్న హీరో అంటున్నారు.. అలాంటోళ్లు మన దగ్గర చాలామంది ఉన్నారు కదా అనుకుంటున్నారా? అయితే మేం పేరు చెప్పేస్తాం. ‘రెడ్’ (Red) , ‘వారియర్’ (The Warriorr) , ‘స్కంద’ (Skanda) అంటూ వచ్చి హ్యాట్రిక్ డిజాస్టర్లు అందుకున్న హీరో రామ్ (Ram Pothineni) గురించే ఇదంతా. ‘డబుల్ ఇస్మార్ట్’తో (Double Ismart) త్వరలో ప్రేక్షకుల్ని పలకరించాల్సిన రామ్ వివిధ కారణాల వల్ల ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తాడు అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ లోపు ఆయన ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్ వచ్చింది.

రామ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో రామ్‌తో ఓ వెబ్‌సిరీస్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని అంటున్నారు. ఈ పనులు ఓ కొలిక్కి వచ్చాక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తారట. ఆ తర్వాత అంటే వచ్చే ఏడాది వెబ్‌సిరీస్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తారట. 15వ తేదీ ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు.

మరోవైపు రామ్ తన కొత్త సినిమాని కూడా ఓకే చేస్తారట. అది కూడా 15నే అనౌన్స్ చేస్తారు అని అంటున్నారు. ఇప్పటికే వెంకటేశ్ (Venkatesh Daggubati) , రానా (Rana Daggubati) , నాగచైతన్య (Naga Chaitanya) లాంటి స్టార్‌లు వెబ్‌సిరీస్‌లతో వచ్చి అలరించారు. ఇప్పుడు రామ్ వంతు. ఇక రామ్ సినిమా సంగతి చూస్తే పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా స్టార్ట్ చేశారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ సినిమా ఆగుతూ వస్తోంది. కొత్త షెడ్యూల్ ఎప్పుడూ అనేది త్వరలో తెలుస్తుంది.













