సుధీర్, శ్రీను లేకపోవడంతో ఒంటరిగా మిగిలిపోయిన రాంప్రసాద్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుధీర్ టీమ్ ఒకటి. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను ముగ్గురు మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే తాజాగా వీరి స్నేహబంధం బీటలు బారినట్టు తెలుస్తోంది.జబర్దస్త్ వేదికపై ఈ ముగ్గురు కలిసి చేసే స్కిట్ ఎంత ఆదరణ ఉంటుందో మనకు తెలిసిందే.అయితే ఇకపై జబర్దస్త్ వేదికపై అలాంటి సందడి కనబడదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుదీర్ గెటప్ శ్రీను కనిపించకపోవడంతో ఆటో రాంప్రసాద్ ఒంటరిగా కనిపించారు. ఈ సందర్భంగా కార్తీక్, కార్తీక్ టీమ్ సుడిగాలి సుదీర్ ఫ్రెండ్షిప్ గురించి స్కిట్ చేశారు. ఇక ఈ స్కిట్ చూస్తున్నంతసేపు ఆటో రాంప్రసాద్ రష్మి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఆటో రాంప్రసాద్ వేదికపై మాట్లాడుతూ నేను స్క్రిప్ట్ రైటర్ ని నాకేం పర్వాలేదు అనుకున్నాను.

అయితే సుడిగాలి సుధీర్ గెటప్ శీను ఇద్దరూ స్థితిలో లేకపోవడంతో ఒంటరి వాడిని అయ్యాను అనే ఫీలింగ్ కలుగుతుంది. ఒంటరిగా స్కిట్ చేయాలంటే ఏదోలా ఉంది అంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా రాంప్రసాద్ ఎమోషనల్ అవ్వడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే జడ్జి ఇంద్రజ వేదికపైకి వచ్చి ఆటో రాంప్రసాద్ ను ఓదార్చే ప్రయత్నం చేసింది. మీ టీమ్ కి ఎవరి దిష్టి తగిలిందో అంటూ ఆమె ఆటో రాంప్రసాద్ ను ఓదార్చారు.

ఇక ఆటో రాంప్రసాద్ వేదికపై మాట్లాడుతూ ఉండగా యాంకర్ రష్మి ఏకధాటిగా కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు.ఈ కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి జబర్దస్త్ వేదికపై సందడి చేసిన సుధీర్ ఇకపై ఈ కార్యక్రమంలో ఉండరని తెలియడంతో జబర్దస్త్ కార్యక్రమంలో కూడ కల తప్పి పోతుందని చెప్పాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus