టాలీవుడ్‌లో సినిమాలు విడుదల చేయాలంటే కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ మాటకొస్తే అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉంటాయి. అయితే మన దగ్గర డ్రై మంథ్స్, డౌట్ ఉన్న నెలలు అంటూ కొన్ని ఉంటాయి. ఆ నెలల్లో సినిమాలు రాకుండా చూసుకుంటూ ఉంటారు. వీటికితోడు గత సినిమాల ఫలితాలు ఎలాగూ ఉంటాయి. గత సినిమా ఏదో ఒకటి ఆ నెలలో వచ్చిన సరైన విజయం అందుకోకపోయినా, సరైన ఫలితం రాకపోయినా ఆ నెలలో మరో సినిమా రిలీజ్ అంటే హీరోలు, దర్శకులు భయపడతారు. ఇప్పుడు రామ్ కూడా అలానే ఆలోచించాడట.
‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా ఇటీవల విడుదలై తొలిరోజు మంచి టాక్ తెచ్చుకుని, ఆ తర్వాత అది మిక్స్‌డ్ టాక్‌కి మారిపోయింది. ఈ నేపథ్యంలో రామ్ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడు అనే చర్చ గత కొన్ని రోజులుగా సాగుతోంది. ఇప్పుడు రామ్ వచ్చాడు.. మాట్లాడాడు. సినిమా గురించి హెచ్చులకు పోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేసి తానెందుకు టాలీవుడ్‌లో స్పెషల్ అనేది మరోసారి చూపించాడు. ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలనే ఉద్దేశంతోనే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా తీశామని, కానీ పరిస్థితులు కారణంగా అన్‌సీజన్‌లో విడుదల చేయాల్సి వచ్చిందన్నాడు.

హిట్టా? ఫట్టా? అనేది వేరే సినిమాల విషయంలో అనుకుంటుంటాం కానీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ విషయంలో ఇది మంచి సినిమా అని అనుకోవాలి అనుకున్నాం. సినిమా విడుదల రోజే కలెక్షన్ల రికార్డులు కొట్టేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ప్రేక్షకుల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. వాళ్లకు సినిమా నచ్చకపోతే వదిలేస్తా. అంతేగానీ పదే పదే దాని గురించి చెప్పను అని చాలా కంపోజ్డ్‌గా మాట్లాడాడు. అంటే ఇక ఈ సినిమా ఫలితం ప్రేక్షకుల చేతుల్లో పెట్టేసినట్లే. ఇతర హీరోల సినిమాల్లో వంద కోట్ల వసూళ్ల పోస్టర్లు రిలీజ్ చేసేది లేదన్నమాట.
ఇక నవంబరు సంగతి చూస్తే.. గతంలో వెంకటేశ్, రామ్ కలసి నటించిన ‘మసాలా’ సినిమా 2013 నవంబరులో విడుదలై, ఆశించిన ఫలితం అందుకోలేదు. ఆ గతాన్ని గుర్తుచేసుకునే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా నవంబరులో రిలీజ్ చేసేందుకు భయపడ్డాడట.
ఆయన కాకుండా వేరే హీరో ఉండి ఉంటే ‘ఆంధ్రా కింగ్’కి కనెక్ట్ అయ్యేవారా?
