The Warriorr: ‘ది వారియర్’ వచ్చేస్తున్నాడు..!

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి ఇండస్ట్రీలో ఫామ్ లోకి వచ్చిన హీరో రామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన లింగు స్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇకపోతే ఈ సినిమా నుంచి బుల్లెట్ సాంగ్ ఇప్పటికే 100 మిలియన్ వ్యూస్ సాధించుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పాటను శింబు పాడటం గమనార్హం. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా జులై 14 వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ జులై 1వ తేదీ సాయంత్రం రాత్రి 7:57 గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో మొదటిసారిగా రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ ఆది పినిశెట్టితో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.లింగస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా జులై 14వ తేదీ విడుదల కావడంతో విచిత్రబంధం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శీను దర్శకత్వంలో చేయనున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus