మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’, ‘రవితేజ టీం వర్క్స్’ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ వేణు కూడా ముఖ్య పాత్రలో నటించాడు.
టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలు ఏర్పడేలా చేశాయి. ప్రభుత్వ అధికారిగా రవితేజ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. తెలుగులో ఓ సూపర్ హిట్ పడి 50 రోజులు దాటింది. ఆ ముచ్చట ‘రామారావు..’ తో తీరుతుంది అని అంతా భావిస్తున్నారు. ఈ చిత్రంతో థియేటర్లు కళకళలాడాలి అని అంతా ఆశిస్తున్నారు. టికెట్ రేట్ల విషయంలో కూడా ‘రామారావు..’ టీం అత్యాశకు కాకుండా మంచి నిర్ణయమే తీసుకున్నారు అనిపిస్తుంది.
హైదరాబాద్ మల్టీప్లెక్స్ లలో రూ.190 టికెట్ రేటు ఉంది.ఏ ఎం బి లో తప్ప మిగిలిన అన్ని మల్టిప్లెక్స్ లలో ఇవే ధరలు ఉంటాయి. సింగిల్ థియేటర్ లో కూడా సాధారణ రేట్లకే అమ్ముతున్నారు.జనాలు థియేటర్ కు రావడం తగ్గించేశారు అన్న విషయాన్ని గ్రహించిన ‘రామారావు’ యూనిట్ మంచి నిర్ణయమే తీసుకుంది.
ఇంకా చెప్పాలి అంటే తెలివైన నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి.టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉంచితే సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!