Ramabanam OTT: అక్కడ డిజాస్టర్ రిజల్ట్.. ఇక్కడైనా గోపీచంద్ మూవీ రిజల్ట్ మారుతుందా?

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన రామబాణం సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఈ సినిమా బడ్జెట్ కు కలెక్షన్లకు ఏ మాత్రం పొంతన లేదు. 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 5 కోట్ల రూపాయల కలెక్షన్లను కూడా సాధించలేదు. పీపుల్స్ మీడియా బ్యానర్ కు భారీ షాకిచ్చిన సినిమాల జాబితాలో ఈ సినిమా ముందువరసలో నిలిచిందనే సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన సోనీలివ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం జూన్ 3వ తేదీ నుంచి (Ramabanam) ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. డింపుల్ హయాతి, ఖుష్బూ, జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అయితే సోనీ లివ్ నుంచి ఈ సినిమా ఓటీటీ తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉందని సమాచారం అందుతోంది. సోనీ లివ్ ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ కావాల్సిన ఏజెంట్ మూవీ ఆలస్యమైంది. థియేటర్లలో ఏజెంట్ ను చూడని ప్రేక్షకులు ఓటీటీలో చూడటానికి ఎదురుచూస్తున్నారు.

వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను ఈ ఓటీటీ కొనుగోలు చేస్తుండటం గమనార్హం. గోపీచంద్ కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. జడ్జిమెంట్ విషయంలో తప్పటడుగులు వేస్తే కెరీర్ ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉంది. 2023 సంవత్సరంలో భారీ సినిమాలు సైతం భారీ హిట్లుగా నిలవడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గోపీచంద్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలు సాధించినా ఇప్పుడు మాత్రం ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోతున్నారు. గోపీచంద్ రెమ్యునరేషన్ 7 కోట్ల రూపాయలుగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కొత్త తరహా కథలపై ఈ హీరో దృష్టి పెట్టాల్సి ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus