Chiranjeevi: పాట రామజోగయ్య పడ్డ కష్టం… వావ్‌ సుమీ

  • April 4, 2021 / 07:58 PM IST

‘ఆచార్య’ సినిమా పాట ప్రవాహాన్ని ఇటీవల ‘లాహె లాహె…’ పాటతో ప్రారంభించింది చిత్రబృందం. సినిమా థీమ్‌ను తెలుపుతూ, భారీ తనాన్ని చూపిస్తూ, వింటే చిరంజీవి గ్రేస్‌ చూపిస్తూ ఈ పాటను రూపొందించారు. ఈ పాటలోని సాహిత్యానికి మంచి స్పందన వస్తోంది. మరి ఇంత చక్కటి గీతాన్ని రామజోగయ్య శాస్త్రి ఎలా రాశారు, దాని కోసం ఆయనెంత కష్టపడ్డారు లాంటి విషయాలు ఇటీవల వెల్లడించారు. అంతేకాఉద ‘లాహే లాహే’పాట విని రామజోగయ్యకు చిరంజీవి ఫోన్‌ చేసి 15 నిమిషాలు మాట్లాడారట. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే…

చిరంజీవి సినిమాకి ఓ పాట రాయాలనే కోరిక రామజోగయ్య శాస్త్రిలో ఎప్పటి నుండో ఉందట. ‘ఖైదీ నెం 150’లో ‘రైతన్న…’ పాట రాసినప్పటికీ… ఆయనకు తగ్గట్టు పాట రాయాలనే కోరిక ఆయనలో అలాగే మిగిలిందట. ఆ ఎదురుచూపులకు ‘లాహె లాహె…’తో తెరపడిందట. ఈ పాట విని చిరంజీవి ఫోన్‌ చేసి మరీ అభినందించారట. ‘‘కొరటాల శివ ఆలోచనలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. ఆయన మనసులో భావాన్ని కొద్దిగానే బయటకు చెబుతారు. జడలు విరబూసుకున్న అమ్మవారి రూపం ఆయన మనసులో ఉంది. ఎక్కడోచోట సినిమాలో ఆ భావం కనిపించాలని ఆయన అనుకున్నారు. అలా ఈ పాట రాశాను’’ అని చెప్పారు రామజోగయ్య శాస్త్రి.

శివుడు, అమ్మవారి మధ్య ఏకాంత సమయాన్ని, ఇద్దరి మధ్య జరిగే చిన్న చిన్న విషయాలను చమత్కారంగా చెప్పే అవకాశం రావడం నా అదృష్టన్నారు రామజోగయ్య. పాట రిలీజ్‌ అంటే ఒక చిన్న భయం ఉంటుందట. ఎందుకంటే కథ, సందర్భం ఏమీ బయటకు చెప్పకుండా పాట రిలీజ్‌ చేస్తే… దానిని ప్రజలు అర్థం చేసుకుంటారో తెలియదు కదా అని అనుకున్నారట రామజోగయ్య. ‘‘మరోవైపు చిరంజీవి అభిమానుల అంచనాలు వేరే స్థాయిలో ఉంటాయి. భక్తిపరమైన పాటను విడుదల చేస్తే వాళ్లు నిరాశకు గురవుతారా? అనే భయం విడుదలకు ముందు ఉంది. కానీ పాట విడుదలయ్యాక అందరూ దాన్ని బాగా ఆదరించారు’’ అంటూ ఆనందంగా చెప్పారు రామజోగయ్య శాస్త్రి.


వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus