Adipurush: ఆదిపురుష్ మూవీ భవిష్యత్తుకే ప్రమాదకరం.. ప్రముఖ నటి కామెంట్స్ వైరల్!

గతేడాది ఇదే నెలలో థియేటర్లలో విడుదలైన ఆదిపురుష్ (Adipurush) మూవీ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది. ప్రధానంగా రావణుని పాత్ర విషయంలో ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అయితే ఆదిపురుష్ సినిమాలో రావణుని రోల్ గురించి ఇప్పటికే చాలామంది నెగిటివ్ కామెంట్లు చేయగా ఆ జాబితాలో తాజాగా దీపిక చిఖ్లియా (Dipika Chikhlia) చేరారు. ఆదిపురుష్ లో రావణుడిని అలా చూపించడం నాకు నచ్చలేదంటూ ఆమె షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

ఆదిపురుష్ సినిమా చూసి పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందేమో అని భావించే అవకాశం ఉందని దీపికా చిఖ్లియా పేర్కొన్నారు. అది భవిష్యత్తుకే ప్రమాదకరం అని ఈ విషయం తలచుకుంటే బాధేస్తుందని దీపికా చిఖ్లియా అన్నారు. ఈ సినిమాలో చూపించిన విధంగా రావణుడు ఉండడని వాళ్లకు ఎవరూ వివరించడం లేదని ఆమె పేర్కొన్నారు. దీంతో రాముడు, సీత ఇలానే ఉంటారని పిల్లలు నిర్ణయించుకుంటున్నారని దీపిక తెలిపారు.

రావణుడు గొప్ప శివ భక్తుడని ఆయనలో మంచి లక్షణాలు ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు. రావణుడు లైఫ్ లో చేసిన ఒకే ఒక తప్పు సీతను అపహరించడమే అని దీపిక వెల్లడించారు. ఆ ఒక్క పని చేయకపోతే రావణుడు గొప్ప పండితుడిలా ఉండేవారని ఆమె పేర్కొన్నారు. ఆదిపురుష్ లో రావణుడిని రోడ్ సైడ్ రౌడీలా చూపించడం బాధను కలిగించిందని దీపిక చిఖ్లియా వెల్లడించారు.

ఆదిపురుష్ సినిమాను తాను ఇప్పటివరకు పూర్తిగా చూడలేదని దీపిక చిఖ్లియా పేర్కొన్నారు. సీతాదేవిని గులాబీ రంగు చీరలో చూపించడం ఏ మాత్రం నచ్చలేదని ఆమె వెల్లడించారు. రావణుడిని విభిన్నమైన ఆహార్యంలో చూపించడం ఏ మాత్రం నచ్చలేదని దీపిక పేర్కొన్నారు. ఆదిపురుష్ లో రామాయణం గొప్పదనం తగ్గించే ప్రయత్నం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. దీపిక చిఖ్లియా చేసిన కామెంట్లతో నెటిజన్లు ఏకీభవిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus