Hero Ram: ‘ది వారియర్’ హిందీ రైట్స్ ఎంతో తెలుసా..?

  • January 25, 2022 / 09:36 PM IST

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. మన మాస్, కమర్షియల్ సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే తెలుగులో విడుదలయ్యే పాపులర్ సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆ విధంగా చాలా మంది టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ లో గుర్తింపు వచ్చాయి. యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన సినిమాలు కూడా హిందీలో డబ్ అయ్యాయి. వాటికి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఈ క్రమంలో తాజాగా ఆయన నటిస్తోన్న ‘ది వారియర్’ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే హిందీ రైట్స్ రూపంలో భారీ మొత్తాన్ని అందుకున్నారు నిర్మాత. రామ్ హీరోగా దర్శకుడు లింగుస్వాలి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ మధ్యనే సినిమాలో రామ్ లుక్ ను రివీల్ చేస్తూ.. పోస్టర్ ను వదిలారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రామ్ లుక్ వచ్చిన కొన్ని రోజుల్లోనే హిందీ రైట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీనికోసం మొత్తం రూ.16 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇది రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ డీల్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం తొలిసారి ఖాకీ చొక్కా వేసుకున్నారు రామ్. ఈ సినిమాలో ఆయన సరసన కృతిశెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. నటుడు ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నటి అక్షర గౌడ కీలకపాత్రలో కనిపించనుంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి దానికి పరిస్థితులు అనుకూలిస్తాయో లేదో చూడాలి!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus