తారల జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రాలకు మంచి పేరుతో పాటు, లాభాలు వస్తున్నాయి. అలనాటి అందాల నటి సిల్క్ స్మిత లైఫ్ ని బేస్ చేసుకొని తీసిన మూవీ డర్టీ పిక్చర్ సూపర్ సక్సస్ అయింది. అందుకే సీనియర్ నటుల బయోపిక్ తీయడానికి కొంతమంది ఉత్సాహం చూపిస్తున్నారు. మహానటి సావిత్రి పై సినిమా తీసేందుకు ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఇప్పుడు గొప్పనటి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని ప్రధాన ఘట్టాలను మేళవించి మంచి సినిమా తీయాలని ఓ తమిళ నిర్మాత సిద్ధమయ్యారు.
ఆమె కథను టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు శాండిల్ వుడ్ లోను చూస్తారని ధీమాతో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టారు. జయలలిత క్యారక్టర్ కి ఎవరు సూటవుతారు? అని ఆయన తన టీమ్ తో చర్చించగా అందరూ రమ్య కృష్ణ కే ఓటు వేశారంట. నరసింహ, బాహుబలి చిత్రాల్లో ఆమె చేసిన నటనను వారు మర్చిపోలేకపోతున్నారు. నటిగా, పార్టీ కార్యకర్తగా, ముఖ్యమంత్రిగా జయలలిత జీవితం సాగింది. జైల్లోనూ కొన్ని రోజులు గడిపారు. అలాంటి ధీర వనితగా నటించాలంటే రమ్యకృష్ణ కరక్ట్ అని నిర్ణయానికి వచ్చారు. త్వరలో ఆ నిర్మాత రమ్యకృష్ణను సంప్రదించి మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.