సీనియర్ నటి రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటీ (Ramya Krishna) రమ్యకృష్ణ రజినీకాంత్ తో సినిమాలలో నటించడం గురించి మాట్లాడారు.రజనీకాంత్ తో దాదాపు 24 సంవత్సరాల తర్వాత ఈమె మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలియజేశారు. 1999వ సంవత్సరంలో రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా ఈమె నరసింహ సినిమా విశేషాలను గుర్తు చేసుకున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో 24 సంవత్సరాల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్నానని తెలిపారు. అయితే నరసింహ సినిమాలో తనకు అవకాశం వచ్చినప్పుడు తాను ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సినిమాకి ఓకే చెప్పానని తెలిపారు.ఇలా నా జీవితంలో నేను ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నాను అంటే అది నరసింహ సినిమాకు ఓకే చెప్పడమేనని ఈ సందర్భంగా రమ్యకృష్ణ తెలియజేశారు.
ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత ఇందులో నాది ఫస్ట్ హీరోయిన్ పాత్రనా సెకండ్ హీరోయిన్ పాత్రన అన్న విషయాల గురించి ఆలోచించలేదు ఆయనతో కలిసి నటించడమే నా లక్ష్యం అని తెలిపారు. ఇక ఈ సినిమాలో సౌందర్య మొహం మీద నేను కాలు పెట్టే సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అనే భయం నాలో వెంటాడుతూనే ఉండేదని రమ్యకృష్ణ తెలియజేశారు.ఇలా నరసింహ సినిమా గురించి తాజాగా రమ్యకృష్ణ మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.