రానా విలన్ కాదట!

  • March 18, 2016 / 08:08 AM IST

తమిళ్ స్టార్ ధనుష్, గౌతమ్ మీనన్ కలయికలో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో రానా కూడా కనిపిస్తున్నాడు. ఇందులో రానాది ఓ కీలక పాత్రని, ఆయన విలన్ గా కనిపిస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదని తెలిసిపోయింది.

ఈ విషయం గురించి రానా మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో నాది చాలా చిన్నపాత్ర. జస్ట్ కామియో. షూటింగ్ కూడా అయిపోయింది. ధనుస్-గౌతమ్ అంటే ఇష్టం. అందుకే కామియో చేయడానికి ఒప్పుకున్నా. ఇది కచ్చితంగా మంచి సినిమా అవుతుంది” అని చెప్పుకొచ్చాడు. ‘ఎనై నొక్కి పాయుమ్ తోట’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus