“తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే” .. అని తెలుగులో ఓ పాత సామెత ఉంది. అంటే వ్యాపారంలో బంధుత్వాలు చూడకూడదన్నమాట. ఈ సామెతను అనుసరించడానికి అల్లు అర్జున్, రానాకి కుదరడంలేదు. ఎందుకో వారే చెప్పారు. బన్నీ తనతండ్రి అల్లు అరవింద్ బ్యానర్లో సరైనోడు చిత్రాన్ని చేశారు. ఆ మూవీ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మరి ఆ లాభాల్లో కొంతైనా బన్నీ చేతికొచ్చిందా? అంటే రాలేదంట. “సరైనోడు సినిమాతో చాలా లాభాలు వచ్చాయి.. కాని మా నాన్నగారు నాకు ఇంకా ఏమీ ఇవ్వలేదు. ఏదన్నా ఇస్తే బాగుంటుంది” అంటూ ఓ కార్యక్రమంలో మీడియా ముందు చెప్పారు. ఆ కార్యక్రమంలో అల్లు అరవింద్ ఉన్నారు. ఆయన కొడుకు మాటలకూ సరదాగా నవ్వుకున్నారు తప్ప ఇస్తానని మాట ఇవ్వలేదు.
ఇక రానా విషయానికి వస్తే అతని తనతండ్రి బ్యానర్ సురేష్ ప్రొడక్షన్ లో “నేనే రాజు నేనే మంత్రి” సినిమా చేశారు. ఆ మూవీ ఆడియో ఫంక్షన్లో “మీ నాన్నగారు నీకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు” అని రానాను అడిగితే.. ఏమీ ఇవ్వలేదని చెప్పాడు రానా. మరి అడగకపోయావా? అని సలహా ఇస్తే.. “నేను ఆయన ఇంట్లోనే ఉంటున్నా.. అన్నం పెట్టడం మానేస్తారు.. ఎందుకొచ్చిందిలే” అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. అప్పుడు పక్కనే ఉన్న సురేష్ బాబు కూడా నవ్వేశారు. ఆగస్టు 11 న ఈ మూవీ రిలీజ్ కానుంది. మరి లాభాలు వస్తే రానాకి సురేష్ బాబు వాటా ఇస్తారేమో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.