Rana: హీరోయిన్ తో నాకు ఉన్న రిలేషన్ అదే: రానా

ఇండస్ట్రీలో కొనసాగే హీరోలు హీరోయిన్లు మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు రావడం సర్వసాధారణంగా జరిగే అంశమే ఒక హీరో హీరోయిన్ కలసి కాస్త క్లోజ్ గా కనిపించిన వారి మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ వార్తలు వస్తాయి. ఇలా ఎంతో మంది హీరోలు ఈ విధమైనటువంటి రూమర్లను ఎదుర్కొన్నారు ఈ క్రమంలోనే దగ్గుబాటి వారసుడుగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టినటువంటి రానా కూడా ఇలాంటి వార్తలలో నిలిచారు.

రానా పలానా హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రావడానికి అంటే ముందు బాలీవుడ్ ఇండస్ట్రీలో దమ్ మారో ధమ్ అనే సినిమాలో నటించడం జరిగింది. ఆ సినిమాలో నటించేటప్పుడు బిపాషా బాసుతో రానాకు స్నేహం కుదిరిందని, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఏదో రిలేషన్ ఉంది అంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి.

ఇలా రానా (Rana) గురించి బిపాషా బసు గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి ఒకసారి హైదరాబాద్ కి వచ్చారు. దీంతో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై ఎన్నో సందర్భాలలో రానా స్పందించి మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహబంధం మాత్రమేనని క్లారిటీ ఇచ్చిన ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.

ఇక తాను కేవలం బిపాసా బసుతో మాత్రమే కాదు ఈ సినిమాలో నటించిన అందరితోనూ నాకు ఎంతో మంచి స్నేహబంధం ఉంది అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈయనకు త్రిషకు మధ్య కూడా ఏదో రిలేషన్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా ఫలానా హీరోయిన్లతో ఈయన రిలేషన్లో ఉన్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ రానా మాత్రం తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని ప్రస్తుతం సినిమాలపరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags