Rana Daggubati: ‘లీడర్’ సెక్వెల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రానా..!

దగ్గుబాటి రానా హీరోగా ఎంట్రీ ఇచ్చింది ‘లీడర్’ చిత్రంతో..! శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2010 వ సంవత్సరం ఫిబ్రవరి 19న విడుదలైంది. అన్ సీజన్లో రిలీజ్ అవ్వడం వల్ల ఈ చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేయలేదు కానీ, ఇదొక క్లాసిక్ అని చెప్పాలి. శేఖర్ కమ్ముల మార్క్ పొలిటికల్ డ్రామా. ఈ కథని చాలా మంది హీరోలకి శేఖర్ కమ్ముల వినిపించాడు.

అయితే అప్పుడు కథలో మార్పులు చేయాలనే డిమాండ్ రావడంతో.. చివరికి నూతన హీరో అయిన రానాతో ఈ మూవీని తెరకెక్కించాడు.రానాకి ఇది మొదటి సినిమా అంటే ఎవ్వరూ నమ్మరేమో.. ఎందుకంటే అతను అంత మెచ్యూర్డ్ గా నటించి మెప్పించాడు. రానా తప్ప ఈ పాత్రకి ఎవ్వరూ న్యాయం చేయలేరేమో అనేంతలా ఈ అర్జున్ ప్రసాద్ పాత్రకి జీవం పోసాడు. ఇదిలా ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని..’అరణ్య’ ‘లవ్ స్టోరీ’ సినిమాల రిలీజ్ టైములో దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు.

ఇదే విషయమై రానాని ప్రశ్నించగా… అతను ఆసక్తికరం సమాధానాలు చెప్పుకొచ్చాడు.’భీమ్లా నాయక్’ ప్రమోషన్లలో భాగంగా రానా ఈ విషయం పై స్పందించాడు. ‘శేఖర్ కమ్ముల ‘లీడర్’ సీక్వెల్ గురించి నాకు రెండు మూడు సీన్లు చెబుతుంటారు మళ్ళీ సైలెంట్ అయిపోతుంటారు. అది పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంది’ అంటూ రానా బదులిచ్చాడు. దీనిని బట్టి చూస్తే.. ‘లీడర్’ సీక్వెల్ కు సంబంధించి అయితే శేఖర్ కమ్ముల ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టేశాడని స్పష్టమవుతుంది. మరి ఈ ప్రాజెక్టు ఎప్పటికి సెట్ అవుతుంది..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus