క‌ర్వా చౌత్ పండుగ జరుపుకున్న రానా, మిహీకా!

క‌ర్వా చౌత్ అంటే ఉత్తరాదిన మహిళలకు అత్యంత పవిత్రమైన పర్వదినం. మ‌న ద‌గ్గ‌ర అట్ల త‌ద్ది పేరుతో ఈ వేడుకను జరుపుకుంటారు. ఈ పండుగ ఆచారం ప్రకారం.. పెళ్లి అయిన మహిళలు తమ భర్త కోసం, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు తమకు కాబోయే భ‌ర్త యోగక్షేమాలు కోరుతూ ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూశాకే ఆ ఉపవాసదీక్ష విడవడంతో పాటు చంద్రుడిని చూసిన తర్వాత ముందుగా భర్త ముఖమే చూసి అతడి ఆశీస్సులు తీసుకుంటారు.

బుధవారం నాడు ఈపండుగ జరుపుకున్న సెలబ్రిటీలంతా వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఉత్సహపరిచారు. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో రానా, మిహీకాలు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఈ మధ్యనే రానా తను ప్రేమించిన మిహీకాను పెళ్లాడారు. పెళ్లి తరువాత ఈ జంట కలిసి జరుపుకున్న దసరా వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా క‌ర్వా చౌత్ వేడుకలో పాల్గొన్న ఈ జంట ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇందులో రానా తన భార్య వంక చూస్తూ నవ్వుతున్న ఫోటో అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలలో మిహికా సౌత్ స్టైల్ లో చీర కట్టుకొని పద్దతిగా మెరిసిపోతుంటే.. రానా మాత్రం సింపుల్‌గా టీషర్ట్, జీన్స్ తో దర్శనమిచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రానా నటించిన ‘అరణ్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే గుణశేఖర్ రూపొందిస్తోన్న ‘హిరణ్యకశ్యప’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.

1

2

3

4

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus