ఈరోజు దగ్గుబాటి రానా పుట్టినరోజు కావడంతో ‘భీమ్లా నాయక్’ నుండీ.. అతని పాత్ర అనగా డేనియల్ శేఖర్ కు సంబంధించి మరో గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. “వాడు అరిస్తే భయపడతావా… ఆడికన్నా గట్టిగా అరవగలను… ఎవడాడు….దీనమ్మ దిగొచ్చాడా…ఆఫ్ట్రాల్ ఎస్ ఐ.. సస్పెండెడ్….” అంటూ డేనియల్ శేఖర్ పాత్రను పోషిస్తున్న రానా ఆవేశంగా మురళీ శర్మతో అరుస్తూ మాట్లాడుతున్నాడు. ఈ సన్నివేశం థియేటర్లలో ఓ రేంజ్లో ఉంటుందేమో అనే ఉత్సుకతని రేకెత్తిస్తోంది.
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ కూడా కనిపిస్తున్నాడు. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు కాగా త్రివిక్రమ్ కూడా సంభాషణలు సమకూరుస్తున్నాడు. ఇక ‘భీమ్లా నాయక్‘ చిత్రీకరణ తుది దశలో ఉంది.జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు కానీ.. అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనే టాక్ బలంగా వినిపిస్తుంది.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల సరసన నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను ,బ్రహ్మాజీ, కాదంబరి కిరణ్, చిట్టి, పమ్మి సాయి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు, పాటలు సినిమా పై భారీ అంచనాలు నమోదయ్యేలా చేసాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే.
‘అహానికి- ఆత్మ గౌరవానికి జరిగిన యుద్ధం’ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్, రానా ల మధ్యలో క్లైమాక్స్లో వచ్చే ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇన్సైడ్ టాక్.ఒరిజినల్ తో పోలిస్తే ‘భీమ్లా నాయక్’ లో చాలా మార్పులు చేసారని వినికిడి. తెలుగు నేటివిటీకి మరియు పవన్ అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా ఆ మార్పులు ఉండబోతున్నాయి.
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!