Rana Daggubati: ‘హిరణ్య కశ్యప’పై అప్డేట్ ఇచ్చిన రానా!

రానా దగ్గుబాటి హీరోగా దర్శకుడు గుణశేఖర్ ‘హిరణ్య కశ్యప’ అనే సినిమా చేయాలనుకున్నారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు గుణశేఖర్. మూడేళ్ల పాటు సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరిపారు. కానీ సడెన్ గా ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి సమంతతో ‘శాకుంతలం’ సినిమాను మొదలుపెట్టారు గుణశేఖర్. దీంతో ఇక రానాతో గుణశేఖర్ భారీ ప్రాజెక్ట్ ఉండదని టాక్ వచ్చింది.

ఆ వార్తలపై రానా కానీ గుణశేఖర్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో భాగంగా రానాకి ఆ సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి వెంటనే రానా స్పందించారు. ‘హిరణ్య కశ్యప’ సినిమా ఉంటుందని.. వచ్చే ఏడాది మార్చ్ లో ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని.. దాని కోసం బాగా బాడీ బిల్డ్ చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్న గుణశేఖర్ త్వరలోనే రానా ‘హిరణ్య కశ్యప’ సినిమాకి సంబంధించి ఫైనల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టనున్నారు.

అలానే రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్.. తేజ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా గురించి రానా మాట్లాడారు. ఆ సినిమా షూటింగ్ కొన్ని రోజుల మినహా పూర్తయిందని.. ఇప్పటివరకు తను రషెస్ కూడా చూడలేదని చెప్పారు. అలానే బాబాయ్ వెంకటేష్ తో కలిసి నటిస్తోన్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ గా రానుందని తెలిపారు. నెక్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదని అన్నారు.

‘విరాటపర్వం’ సినిమాతో జూన్ 17న థియేటర్లలోకి రాబోతున్నారు రానా. ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రిజల్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు రానా.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus