Rana Daggubati: సంక్రాంతి సెంటిమెంట్ ను రానా బ్రేక్ చేస్తారా?

లీడర్ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయమైన రానా తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే కమర్షియల్ గా ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. సోలో హీరోగా రానా నటించిన సినిమాలలో నేనేరాజు నేనే మంత్రి, ఘాజీ మినహా మిగతా సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని రానా భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కు ధీటైన రోల్ లో నటిస్తున్నారు.

ఈ సినిమా కోసం రానా ఏకంగా 5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. 2022 సంవత్సరం జనవరి నెల 12వ తేదీన థియేటర్లలో భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ విడుదలైన ఐదు రోజులకే థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ విషయంలో దాదాపుగా మార్పు లేనట్టేనని తెలుస్తోంది. అయితే బాలయ్య హీరోగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా 2019 సంవత్సరం సంక్రాంతికి విడుదలైంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని రానా నటించిన 1945, భీమ్లా నాయక్, విరాటపర్వం సినిమాలు కొన్నిరోజుల గ్యాప్ లోనే విడుదల కానున్నాయి. 1945 సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. సంక్రాంతికి విడుదలైన కథానాయకుడు సినిమాతో ఫ్లాప్ అందుకున్న రానా భీమ్లా నాయక్ సినిమాతో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ కు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా భీమ్లా నాయక్ తో రానా ఫస్ట్ పొంగల్ హిట్ అందుకుంటాడో లేదో చూడాల్సి ఉంది. రానా నటించిన విరాటపర్వం సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. మేకర్స్ త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారేమో చూడాలి.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus