Rana Daggubati: ఆ సినిమాకు మాత్రమే బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉందా?

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రికార్డులు ఇప్పట్లో బ్రేక్ కావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే సినిమా ప్రాజెక్ట్ కే అని తాజాగా రానా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రానా ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సినిమాలకు బౌండరీలు లేవని హద్దులు చెరిగిపోయాయని ఆయన చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్ కే మూవీ ఆ బౌండరీలను మరింత చెరిపేసే అవకాశం అయితే ఉందని ఆయన కామెంట్లు చేశారు. బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ సాధించలేని రికార్డులను సైతం ఈ సినిమా సాధిస్తుందని రానా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సినిమాల బౌండరీలను ప్రాజెక్ట్ కే దాటుతుందని రానా పేర్కొన్నారు.

రానా (Rana Daggubati) చేసిన కామెంట్లతో ప్రాజెక్ట్ కే సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ సినిమాను నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో చూడాల్సి ఉంది. ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి రాబోయే రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ కు ఇంకో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ప్రాజెక్ట్ కే సినిమాలో బాలీవుడ్ నటీనటులు ఎక్కువ సంఖ్యలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus