Rana Daggubati: రానా ఫుడ్ స్టోర్.. కేజీ టమాటా జస్ట్ రూ.4,250లు!

తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన హీరోలు కొన్నిసార్లు కొత్త వ్యాపారాల్లో అడుగుపెడుతుంటారు. తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) ఇదే కోవలోకి చేరారు. తన భార్య మిహికా బజాజ్ తో కలిసి హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన ఫుడ్ స్టోర్ ప్రారంభించారు. కానీ, ఈ స్టోర్ ఖరీదైన వస్తువులతో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. బంజారాహిల్స్ లో ప్రారంభమైన ఈ ఫుడ్ స్టోర్ లో సాధారణ కూరగాయలే కాదు, ఆర్గానిక్, ఇంపోర్టెడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి.

Rana Daggubati

కానీ, వీటి ధరలు సామాన్యులను షాక్ కు గురి చేస్తున్నాయి. పక్కా ఇది డబ్బున్న వాళ్లకోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు అర్ధమవుతుంది. అయితే ఉదాహరణకు, కేవలం 200 గ్రాముల టమాట ధర ఏకంగా ₹850. అంటే కేజీ టమాట ధర ₹4,250! ఇది వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. అంతేకాకుండా, ఒక కొబ్బరి బొండం ధర ₹1,000గా ఉంది. బయట వీటి ధరలు 100 రూపాయల లోపే ఉండగా ఇక్కడ మాత్రం హై క్వాలిటీ అంటూ ప్రైజ్ తో పాటు ఓ క్లారిటీ కూడా ఇస్తున్నారు.

రానా ఫుడ్ స్టోర్ లో ఉండే అన్ని వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసినవే. మెక్సికో, నెదర్లాండ్స్, స్పెయిన్ వంటి దేశాల నుంచి కూరగాయలు, పండ్లు, జ్యూస్, స్నాక్స్ వంటి ప్రత్యేకమైన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి. తక్కువగా దొరికే అరుదైన మష్రూమ్ కిలో ధర ఏకంగా ₹5 లక్షలు. ఒక గ్లాస్ చెరకు రసం కూడా ఇక్కడ ₹275 గా ఉంది. ఈ స్టోర్ ప్రారంభం తర్వాత, దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli) భార్య రమా రాజమౌళి (Rama Rajamouli) ఈ ఫుడ్ స్టోర్ ను సందర్శించి, అక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేశారు.

ఇలాంటి ఖరీదైన స్టోర్ హైదరాబాద్ లో ప్రారంభం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రానా, మిహికా ఈ స్టోర్ ను ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా పెట్టుకునే సెలబ్రిటీల కోసం ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తానికి, రానా తన ఫుడ్ స్టోర్ తో వినియోగదారులకు ప్రత్యేక అనుభూతిని అందించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, సామాన్యులు ఈ రేట్లు చూసి షాక్ అవుతున్నారు.

వర్జినిటీ గురించి స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus