Rana Daggubati: మహేష్‌ – రాజమౌళి సినిమా మీద రానా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

సినిమా మొదలు కాకుండా.. కనీసం అధికారికంగా ప్రకటన కూడా రాకుండదా జనాలు తెగ మాట్లాడుకుంటున్నారు అంటే అది కచ్చితం రాజమౌళి (S. S. Rajamouli)  – మహేష్‌బాబు  (Mahesh Babu) సినిమానే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా గురించి రోజూ ఎవరో ఒక సెలబ్రిటీ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. సినిమా గొప్పతనం గురించి, భారీతనం గురించి, అంచనాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా రానా దగ్గుబాటి   (Rana Daggubati) కూడా సినిమా గురించి మాట్లాడారు. మహేశ్‌ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు.

Rana Daggubati

అయితే ఎవరూ ఊహించనంత భారీ స్థాయిలో ఉంటుందని వార్తలొస్తున్నాయి. తాజాగా రానా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘మహేష్‌ – రాజమౌళి సినిమా అన్ని బారియర్స్‌ను బ్రేక్‌ చేస్తుంది. హాలీవుడ్‌ సినిమా అమెరికాలో ఎలా రిలీజ్‌ అవుతుందో.. ఈ సినిమా కూడా అలానే విడుదల కావాలని కోరుకుంటున్నా’’ అని అన్నాడు. అంటే రాజమౌళి మనసులో ఆ ఆలోచన ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే జక్కన్నను ఇటీవల రానా ఇంటర్వ్యూ చేశాడు.

ఆ సందర్భంలో మహేష్‌ బాబు సినిమా గురించి కచ్చితంగా ప్రస్తావన వచ్చే ఉంటుంది. అది ఆఫ్‌లైన్‌లో కూడా జరిగి ఉండొచ్చు. ఇక రానా చెప్పిన మరో విషయం చూస్తే.. ఇంతకుముందు ఇండియన్‌ సినిమా అంటే వేరే దేశాల వారికి హిందీ చిత్రాలే తెలుసు. ఇప్పుడు సౌత్‌ సినిమాల గురించి కూడా తెలిసింది అని అన్నాడు. ఓటీటీలతో సినిమా భాష పరిధులు తొలిగిపోయాయి అని చెప్పాడు రానా.

ఇక మహేశ్‌- రాజమౌళి సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ సినిమా కోసం మహేష్‌ ఇప్పటికే లుక్ మార్చిన సంగతి తెలిసిందే. అది ఫైనలేమో అనుకుంటే.. గడ్డం గీసేసి మొన్నీమధ్య మరో లుక్‌లో కనిపించాడు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా ప్రారంభం కావొచ్చు.

సత్యదేవ్ కి వర్కౌట్ అయ్యేలా ఉందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus