Rana Daggubati: ప్రభాస్, మహేష్ ల గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన రానా

దగ్గుబాటి రానా తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి చేసిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మార్చి 10 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ డైరెక్ట్ చేస్తున్న ఈ పెర్ల్ గిల్, సుందర్ ఆరోన్ నిర్మించారు. ఇక ఈ సిరీస్ ను బాలీవుడ్ లో ఎడతెగకుండా ప్రమోట్ చేస్తున్నాడు రానా. ఈ సందర్భంగా ఓ నేషనల్ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా రానా.. ఒకప్పుడు తెలుగు హీరోల గురించి బాలీవుడ్ జనాలకు ఎంత వరకు తెలుసు?

మన హీరోల గురించి చెబితే బాలీవుడ్ జనాలు ఎలా రియాక్ట్ అయ్యేవారు వంటి విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఒకప్పుడు ప్రభాస్, మహేష్ అంటే బాలీవుడ్ జనాలకు కనీసం తెలీదు అంటూ అతను షాకింగ్ కామెంట్లు చేశాడు. రానా మాట్లాడుతూ.. ” గత 3,4 ఏళ్ళుగా తెలుగు సినిమాలు హిందీలో కూడా బాగా ఆడుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ అన్ని భాషల్లో రూపొందే చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇది అందరూ సంతోషించదగ్గ విషయం.

నా ‘ఘాజీ’ సినిమా హిందీలో కూడా బాగా ఆడింది. ఆ తర్వాత నేను వరుసగా తెలుగులోనే సినిమాలు చేశాను. నేను ‘బాహుబలి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు ముంబైలో ఉన్న నా ఫ్రెండ్ ఒకరు.. ‘ఏ సినిమాలు చేస్తున్నావ్ అని అడిగారు . అప్పుడు నేను ‘బాహుబలి’ అన్నాను. ‘హీరో నువ్వేనా?’ అని అతను అడిగితే.. ‘కాదు ప్రభాస్ అని చెప్పాను’. అప్పుడు అతను..’ప్రభాస్ ఎవరు’ అని అడిగాడు. అప్పుడు ప్రభాస్ నటించిన హిట్ సినిమాల పేర్లు అతనికి చెప్పగా..

అందులో ఒక్క సినిమా కూడా అతను చూడలేదు. తర్వాత మహేష్ గురించి చెప్తే.. ‘చిన్ను భర్త కథా.. తెలుసు’ అన్నాడు. చిన్ను అంటే ఎవరో అప్పుడు నాకు తెలీదు. కొంత గ్యాప్ తర్వాత నమ్రత గారిని చిన్ను అంటరాని తెలిసింది. అయితే ఆమె భర్తగా మాత్రమే మహేష్ అక్కడి జనాలకు తెలుసు. అతని సినిమాలు మాత్రం అక్కడి జనాలకు తెలీదు. అప్పుడు నేను అతనితో ఒక 4,5 ఏళ్ళు ఆగు మా హీరోలంతా ఇక్కడ ల్యాండ్ అవుతారు అని చెప్పాను. ఇప్పుడు అది నిజమైనందుకు సంతోషంగా అనిపిస్తుంది” అంటూ రానా చెప్పుకొచ్చాడు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus