Rana Daggubati: మరోసారి ముచ్చట్లకు సిద్ధమైన రానా.. ఎప్పుడు? ఎక్కడ? ఎలా?

టాలీవుడ్‌లో తొలినాళ్లలో టాక్‌ షో చేసిన హీరో అంటే రానానే (Rana Daggubati) . ‘నెం 1 యారీ’ అంటూ తొలి తరం ఓటీటీలో ఆయనో షో చేశాడు. అప్పట్లో viu అనే ఓటీటీ యాప్‌లో స్ట్రీమ్‌ అయింది. ఆ తర్వాత టీవీల్లోకి వచ్చింది. ఆహా ఓటీటీకి కూడా వచ్చింది. ఇప్పుడు రానా మరోసారి హోస్ట్‌ అవతారం ఎత్తుతున్నాడు. అయితే ఈసారి అమెజాన్‌ ప్రైమ్‌లోకి వస్తున్నాడు. పేరు కూడా ఆయనే ‘ది రానా దగ్గుబాటి షో’ అని పెట్టుకున్నాడు.

Rana Daggubati

ఈ నెల 23 నుండి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ టాక్‌ షో స్ట్రీమ్‌ అవ్వనుంది. త్వరలో తొలి ఎపిసోడ్‌ ప్రోమోను రిలీజ్‌ చేస్తారు అని అంటున్నారు. దానికి ముందు ఓవరాల్‌ సీజన్‌ ప్రోమో కూడా వస్తుంది అని చెబుతున్నారు. ప్రతి శనివారం ఓ కొత్త ఎపిసోడ్‌ తరహాలో ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ షో ఉంటుందట. ఇందులో దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan), నాగ చైతన్య (Naga Chaitanya) , సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), శ్రీలీల, నాని (Nani) , రాజమౌళి (S. S. Rajamouli) తదితరులు ప్రత్యేక అతిథులుగా వస్తారని టాక్‌.

సినీ ప్రముఖుల జీవితాల్లో ఎవరికీ తెలియని కోణాల్ని ఈ సిరీస్‌ ఆవిష్కరిస్తుందని చెబుతోంది టీమ్‌. ఈ షో నిర్వహణతోపాటు, సృష్టికర్త, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత కూడా రానానే కావడం గమనార్హం. అంటే ఈ షోకి అన్నీ ఆయనే. గతంలో చేసిన షోలో చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ.. చాలామంది తెలియని విషయాలను బయటకు తీసుకొచ్చిన ఘనత రానాది. మరిప్పుడు ఏం చేస్తాడో చూడాలి.

మామూలుగా ఇలాంటి షోలకు తొలి ఎపిసోడ్‌, ఆఖరి ఎపిసోడ్‌ కీలకంగా ఉంటాయి. అందులోనూ ఓవైపు ఆహాలో ‘అన్‌స్టాపబుల్‌’ రన్‌ అవుతున్న సమయంలో రానా ఇలా రావడంతో అనుకోని పోటీ కనిపించనుంది. ఆ షోతో ఈ షోకు పోలికలు కూడా వస్తాయి. కాబట్టి రానా పక్కా ప్రణాళికతో ‘ది రానా దగ్గుబాటి షో’ రెడీ చేశాడు అని అంటున్నారు. చూద్దాం ప్రోమోలు వస్తాయిగా అంటారా. అలానే కానీయండి.

మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ‘కంగువా’!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus