నేను ఆ విషయం గురించి ట్వీట్ చేయకపోతే.. అది నిజం కాదు: రాణా

రాణా సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా మనోడి మీద ఇన్ని గాసిప్పులు, వార్తలు రాలేదు. కానీ.. గత కొన్ని నెలలుగా రాణాకు కిడ్నీ ఆపరేషన్ జరిగిందని, కంటి ఆపరేషన్ జరిగిందని ఇలా రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకూ రాణా ఏ ఒక్క వార్తకూ రెస్పాండ్ అవ్వలేదు సరికదా.. కనీసం వచ్చిన వార్తలను పట్టించుకోలేదు. కానీ.. నిన్న ఉన్నట్లుండి “If I Don’t tweet about it, it is not true” అని ఒక ట్వీట్ వేశాడు. నేను ఆ విషయం గురించి ట్వీట్ చేయకపోతే.. అది నిజం అని ఆ ట్వీట్ అర్ధం.

ట్వీట్ వేయడం వరకు బాగానే ఉంది కానీ.. అది దేని గురించి అనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రాణా ఇప్పటివరకూ తన తాజా చిత్రాల షూటింగ్ లో కూడా పాల్గొనలేదు. హాతీ మేరీ సాతీ, విరాటపర్వంతోపాటు మరో రెండు సినిమాలు రాణా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇకపోతే.. రాణా కీలకపాత్ర పోషించిన “హౌస్ ఫుల్ 4” ఇవాళ విడుదలవుతోంది. ఈ చిత్రంలో రాణా కామెడీ విలన్ రోల్ ప్లే చేశాడు.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిచేసుకోని టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus