రాజమౌళి చెబుతుంటే భయమేసింది
- April 6, 2017 / 02:07 PM ISTByFilmy Focus
ఈర్ష్య, పగ, ప్రతీకారం, రాజ్యాధికార కాంక్ష వంటి ఎమోషన్స్ నిండిన సినిమా బాహుబలి. మొదటి పార్ట్ లో వీటిని కొంత మాత్రమే చూపించారు రాజమౌళి. రెండో పార్ట్ లో పూర్తిగా కళ్లకు కట్టనున్నారు. మహిష్మతి సింహాసనం కోసం భల్లాల దేవ ఎంత కుట్ర పన్నాడు, అమరేంద్ర బాహుబలిని ఎలా చంపాడు.. అనే అంశాలతో పాటు తండ్రిని చంపిన వ్యక్తి, తల్లిని హింసించిన క్రూరుడిని కొడుకు ఏ విధంగా చంపుతాడు అనే సన్నివేశాలు బాహుబలి కంక్లూజన్ లో చూడబోతున్నాం. ఈ పోరాట సన్నివేశాల గురించి రానా నిన్న జాతీయ మీడియాతో మాట్లాడుతూ …. ‘బాహుబలి 2లో పోరాట సన్నివేశాలు చాలా భీకరంగా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అద్భుతం. ఆ పోరాటం గురించి రాజమౌళి చెబుతున్నప్పుడు భయమేసింది.
ఆ ఫైట్ నేపథ్యాన్ని వివరిస్తూ రాజమౌళి మమ్మల్ని చాలా ఉత్తేజపరిచారు. రాజమౌళి చెప్పినంత సీరియస్‌గా మేము ఫైట్ చేస్తే మా ఇద్దరిలో ఎవరో ఒకరమే బతుకుతామనిపించింది. అయితే చాలా జాగ్రత్తలు తీసుకుని షూట్ చేశాం”. అని రానా వివరించారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి తాను, ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం బాగా కష్టపడినట్లు చెప్పారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈనెల 28 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















