Bheemla Nayak: భీమ్లాకు సీక్వెల్.. రానా ఏమన్నారంటే?

శివరాత్రి పండుగ కానుకగా గత నెల 25వ తేదీన భీమ్లా నాయక్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలిరోజు కళ్లు చెదిరే కలెక్షన్లను సాధించింది. వీక్ డేస్ లో కలెక్షన్లు కొంతమేర డ్రాప్ అయినా సెకండ్ వీకెండ్ లో ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసే అవకాశం అయితే ఉందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

వకీల్ సాబ్ సినిమా తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో పవన్ ఖాతాలో మరో సక్సెస్ చేరింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. భీమ్లా నాయక్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి రానాకు ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు రానా సమాధానం ఇస్తూ భీమ్లా నాయక్ కు సీక్వెల్ రాకపోవచ్ఛని తెలిపారు. భీమ్లా నాయక్ మూవీ ఎక్కడ ఎండ్ కావాలో అక్కడే ఎండ్ అయిందని రానా అన్నారు.

అందువల్ల ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని తాను భావించడం లేదని రానా చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమా హిందీ థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ రానా కెరీర్ కు కూడా ప్లస్ అయింది. రానా ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ తో బిజీగా ఉండగా త్వరలో కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటనలు చేయనున్నారు. భీమ్లా నాయక్ సినిమాకు రానా 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.

భీమ్లా నాయక్ లో పవన్ పాత్ర ఏ స్థాయిలో ఆకట్టుకుందో రానా పాత్ర కూడా అదే స్థాయిలో ఆకట్టుకోవడం గమనార్హం. రానా నటించిన విరాటపర్వం సినిమా త్వరలో రిలీజ్ కానుంది. విరాటపర్వం సినిమాతో రానా మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని రానా అభిమానులు కోరుకుంటున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus