Rana, Teja Sajja: నటుడు తేజ సజ్జ పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో తేజ సజ్జ ఒకరు. ఈయన ప్రస్తుతం హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే తాజాగా తేజ నటించినటువంటి హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ నటించినటువంటి

ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో సూపర్‌ హీరో టూర్‌ పేరిట చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబయిలో మీడియా సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి టాలీవుడ్‌ నటుడు రానా దగ్గుబాటి ముఖ్యఅతిథిగా హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రానా తేజ గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇంద్ర సినిమాలో బాలనటుడిగా నటించినటువంటి తేజ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమేనని తెలిపారు. నేను కూడా అతని సినిమాలు చూసి తనకు అభిమాని అయ్యానని రానా తెలిపారు. ఇక తేజ రెండున్నరేళ్ల వయసు నుంచే నటించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో నాకంటే తేజ సీనియర్‌. హనుమాన్‌ సినిమా విడుదల కోసం అందరిలాగే నేను కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి హనుమాన్ టీం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారనీ

ఇది చాలా సంతోషకరమైన విషయం అంటూ ఈ సందర్భంగా (Rana) రానా హీరో తేజను బాలీవుడ్ మీడియాకు పరిచయం చేశారు. ఇక ఈ సినిమా ఏకంగా 11 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంజనాద్రి అనే కల్పిత ప్రదేశం నేపథ్యంలో సాగే చిత్రమిది. కథానాయకుడు హనుమంతుడి శక్తుల్ని పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడనే కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus