Rana Naidu: ‘రానా నాయుడు’ ఫార్ములా అదేనా? ఎవరి ఆలోచనో ఇది!

ఈ మధ్య కాలంలో ఏ ఇద్దరు సినిమా లవర్స్‌ని, వెబ్‌ సిరీస్‌ ప్రేమికుల్ని కదిలిస్తే చాలు.. ‘‘రానా నాయుడు’ చూశావా? ఛీ.. వెంకటేశ్‌ ఏంటి అలా చేశాడు?’ అని అంటున్నారు. అలా అని వాళ్లు వెబ్‌ సిరీస్‌ చూడలేదా అంటే కచ్చితం చూసే ఉంటున్నారు. ఆ తర్వాత ‘ఛీ’ అనే మాట విన్న వ్యక్తి వెంటనే చూసేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకో మనిషిని కలిస్తే మళ్లీ ఇదే డిస్కషన్‌. మీరు కూడా ఇలాంటి మాటలు విన్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.

ఎందుకంటే అలా అని మళ్లీ సిరీస్‌ చూసేవాళ్ల వల్ల సిరీస్‌కు బాగా పబ్లిసిటీ వస్తోంది. ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ రాకముందు చాలా రోజుల క్రితం ‘అన్‌స్టాపబుల్‌’ షోకి రానా వెళ్తే బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఆ సిరీస్‌ మొత్తం బూతుల పండగ అంటగా!’ అని అన్నాడు. మీకు కూడా గుర్తుండే ఉంటుంది. అప్పుడేదో బాలయ్య సరదాగా అన్నాడేమో అనుకున్నారంతా. కానీ బూతుల పండగ మామూలుగా లేదు అని వచ్చాక అర్థమైపోయింది. సిరీస్‌ ట్రైలర్‌ వచ్చాక చిన్న క్లారిటీ వచ్చినా..

సిరీస్‌లో అంత మొత్తంలో ఉండవు అని అనుకున్నారంతా. ఇప్పుడు ఆ బూతులు, నెగిటివ్‌ విమర్శలే సిరీస్‌కు మంచి వ్యూస్‌ తెప్పిస్తున్నాయి అంటున్నారు. అంటే చాలామందిని ఇబ్బంది పెట్టిన నెగిటివ్‌ పబ్లిసిటీ ఇక్కడ ‘రానా నాయుడు’ టీమ్‌కి బాగా పనికొచ్చింది అంటున్నారు. అడల్ట్ కంటెంట్, బూతు డైలాగుల మీద ఓ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయి. అయితే ఆడియన్స్ అవేవీ లెక్క చేయడం లేదు. దీంతో వారం తిరక్కుండానే పది లక్షల వ్యూస్ అవర్స్‌ వచ్చేశాయి అంట సిరీస్‌కి.

ప్రస్తుతానికి మన దేశంతోపాటు కొన్ని ప్రధాన దేశాల్లోనూ ‘రానా నాయుడు’ టాప్ 1లో ఉన్నాడట. దీంతో ఇదంతా ఎలా అనుకుంటున్నారు కొంతమంది. ఇంకొందరు అయితే నెగిటివ్‌ పబ్లిసిటీ మాయ ఇది అంటున్నారు. ఫేస్ బుక్, ట్విటర్‌, షార్ట్స్‌, రీల్స్‌.. ఇలా ఎక్కడ చూసినా రానానే కనిపించాడు. సిరీస్‌ను తెగ ప్రమోట్‌ చేశాడు. అయితే సిరీస్‌ విడుదలైన తర్వాత ఆ పని మౌత్‌ పబ్లిసిటీ చూసుకుంటోంది. ఎందుకు వెంకీ వెబ్‌ సిరీస్‌ను అంతలా తిడుతున్నారు అంటూ కొంతమంది చూస్తుంటే, నిజమైనా అంతలా బూతులు ఉన్నాయా అని ఇంకొందరు అంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus