Rana Naidu: తర్వలో రాబోతున్న రానా నాయుడు సీజన్-2

వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇంతవరకు వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించలేదు. కానీ డైరెక్టగా వెబ్ సిరీస్‌లో కనిపించారు. హాలీవుడ్ సిరీస్ ‘రే డొనోవన్’కు అధికారిక రీమేక్‌గా ‘రానా నాయుడు’ని రూపొందింది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే సమస్యలకు క్రైమ్, యాక్షన్, మాఫియా, డ్రగ్స్ అంశాలను జోడించారు. అన్ని సిరీస్‌ల్లానే ఇది కూడా నిదానంగా ప్రారంభం అవుతుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ స్క్రీన్ ప్లే రేసీగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే కాన్‌ఫ్లిక్ట్‌ను ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా జరుగుతోంది.

ముఖ్యంగా రానా, వెంకటేష్‌ల మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతాయి. ఇందులోని భాష, సన్నివేశాలు ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లు రెగ్యులర్‌గా చూసే వారికి సాధారణంగానే అనిపించవచ్చు కానీ సాధారణ ప్రేక్షకులకు మాత్రం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ విషయాన్ని ప్రమోషన్లలో ముందే తెలిపారు. దీని వల్ల మనం ఎంత ప్రిపేర్ అయినా స్క్రీన్ మీద వాటిని చూసినప్పుడు ప్రాసెస్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది.

ఒక్కో ఎపిసోడ్ నిడివి 50 నిమిషాలకు కొంచెం అటూ ఇటుగా ఉంటుంది. అలాంటి ఎపిసోడ్లు మొత్తం 10 ఉన్నాయి. అంటే దాదాపు 500 నిమిషాల నిడివి అన్నమాట. కానీ ప్రారంభ ఎపిసోడ్ లు తర్వాత స్టోరీ వేగం పుంజుకుంటుంది. కాబట్టి మనకు తెలియకుండా సమయం గడిచిపోతుంది. తేజ్ నాయుడు, జఫ్ఫా నాయుడుల పాత్రలను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ఈ కథ ప్రత్యేకత ఏంటంటే కేవలం రెండు పాత్రల చుట్టూనే తిరగకుండా చాలా పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.

ఇప్పుడు మొదటి సీజన్ కు కంటిన్యూగా రెండో సీజన్ రాబోందిట. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ స్వయంగా వెల్లడించింది. త్వరలోనే సెకండ్ సీజన్ విడుదలవుతుంది అని తెలిపింది. రానా నాయుడు మొదటి సీజన్ ఆడియన్స్ పెదవి విరుపుకి కారణమైంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ రానా నాయుడు కంటెంట్ పై తీవ్ర అభ్యంతరం తెలియజేసారు. ఫ్యామిలీ హీరోగా పేరున్న వెంకటేష్ ఇలాంటి రోల్ చేయడం చాలా మంది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.

(Rana Naidu) రానా నాయుడులో ఉపయోగించిన పదజాలం, అడల్ట్ కంటెంట్ గురించి పక్కనపెట్టినా ఈ సిరీస్ కథ, స్క్రీన్ ప్లే విషయంలో కూడా విమర్శలు వచ్చాయి. రానా నాయుడు చుట్టూ నెగటివిటీ ఉన్నా కానీ దీనికి సెకండ్ సీజన్ ను తీసుకురావడం సాహసమనే చెప్పాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus