Rana Naidu Teaser: పోటాపోటీగా వెంకీ, రానా.. టీజర్ అదుర్స్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. నారప్ప, దృశ్యం2, ఎఫ్3 సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న వెంకటేష్ ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ కోసం రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో రానాతో కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్ విడుదలైంది. అమెరికన్ టీవీ సిరీస్ రే డెనోవన్ కు రీమేక్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

యాక్షన్, క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో 58 సెకన్ల నిడివితో విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. వెంకటేష్, రానా ఈ వెబ్ సిరీస్ లో తండ్రీకొడుకులుగా కనిపించడం గమనార్హం. సాయం కావాలా అంటూ రానా చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలు కాగా “మీ సహాయం గురించి మేమెంతో విన్నాం. సెలబ్రిటీలు ఎవరైనా సమస్యల్లో ఉంటే వాళ్లు నీకే ఫోన్ చేస్తారు. ఫిక్సర్ ఫర్ ది స్టార్స్” అని చెప్పే డైలాగ్ రానా పాత్ర గురించి తెలియజేస్తుంది.

టీజర్ లో వెంకటేష్ వృద్ధుడి గెటప్ లో కనిపించగా వెంకీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. టీజర్ చివర్లో వెంకీ, రానా ఎదురెదురుగా నిలబడి చెప్పే డైలాగ్స్ టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రానా నాయుడు టీజర్ ఉంది. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించగా ఈ వెబ్ సిరీస్ లో హిందీ నటులకు ఎక్కువగా ప్రాధాన్యత దక్కింది.

ప్రస్తుతం హిందీలోనే ఈ టీజర్ రిలీజ్ కాగా సౌత్ భాషల్లో రానా నాయుడు టీజర్ ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. అందరి సమస్యలను పరిష్కరించే రానా ఒక సమస్యను సృష్టించగా రానాను ఆపగలిగే పాత్రలో వెంకటేష్ నటించారు. రానా తుపాకీతో వెంకటేష్ ను బెదిరించే షాట్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. వెంకీ, రానా పోటాపోటీగా నటించగా టీజర్ అదుర్స్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!


శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus