ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్‌ గురించి యువ నటుల షాకింగ్‌ కామెంట్స్‌.. ఇప్పుడు కష్టమే…!

సినిమా పరిశ్రమలో ‘స్నేహం’ అనే మాట ఇప్పుడు వినడం చాలా అరుదు. ఇద్దరు హీరోలు లేదంటే ఇద్దరు హీరోయిన్ల మధ్య స్నేహం పెద్దగా కనిపించడం లేదు. సినిమాల్లోకి వచ్చే ముందు స్నేహం ఉంటే అది ఇక్కడకు వచ్చాక కొనసాగుతుందేమో కానీ.. సినిమాల్లోకి వచ్చాక పెద్దగా స్నేహాలు కుదరడం లేదు. ఈ మాట మేం అంటున్నది కాదు. ఒకట్రెండు స్నేహాలు, యువ హీరోలు, హీరోయిన్‌ చెప్పిన మాటలు చూశాక అనిపించిన మాటలు ఇవి.

Rana, Nani, Teja Sajja

రానా దగ్గుబాటి (Rana Daggubati)  షో అంటూ రానా అమెజాన్‌ ప్రైమ్‌లో ఓ టాక్‌ షో చేస్తున్న విషయం తెలిసిందే. తొలి ఎపిసోడ్‌కి తేజ సజ్జా(Teja Sajja)  , నాని (Nani) , ప్రియాంక అరుళ్‌ మోహన్‌ (Priyanka Mohan)   వచ్చారు. యువ నటుల గురించి ఈ యువ నటులు మాట్లాడుతున్నప్పుడు ఇండస్ట్రీలో స్నేహం గురించి ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో ఇటు నాని – రానా.. మరోవైపు ప్రియాంక మోహన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం సినిమా పరిశ్రమలో సరైన స్నేహం లేదు అనేలా మాట్లాడారు.

ఎవరూ, ఎక్కడ నటుల పేర్లు చెప్పలేదు కానీ.. ప్రస్తుతం ఉన్న నటుల మధ్య అంత స్నేహం ఉండటం లేదు అని అందరూ చెప్పారు. ప్రియాంక మోహన్‌ మాట్లాడుతూ ‘‘పరిశ్రమలో స్నేహం కోసం ప్రయత్నం చేశానని.. కానీ ఎందుకో హీరోయిన్లు ముందుకు రాలేదు’’ అని చెప్పింది. అయితే ఆమె కోలీవుడ్‌ గురించి మాత్రమే మాట్లాడింది. అయితే తెలుగు పరిశ్రమ గురించి ఆమె పెద్దగా మాట్లాడలేదు.

ఇక రానా – నాని – తేజ సజ్జా మట్లాడుతూ ఇప్పుడు గతంలో ఉన్నంత స్థాయిలో స్నేహం లేదు అనేలా మాట్లాడారు. తేజ సజ్జా టైమ్‌లో అయితే మరీ స్నేహం కనిపించడం లేదని కూడా జోకులేసుకున్నారు. దీంతో టాలీవుడ్‌లో మరీ ఇలాంటి పరిస్థితి ఉందా అనే చర్చ మొదలైంది. నిన్నటి తరం యువ హీరోల్లో కాస్త ఉందని రానా – ప్రభాస్‌ (Prabhas) – రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr NTR)– అల్లు అర్జున్‌ (Allu Arjun) , ప్రభాస్‌ – గోపీచంద్‌ (Gopichand) లాంటి కాంబినేషన్లు కనిపిస్తున్నాయి.

అల్లు అర్జున్‌కి ఇద్దరిని దూరం చేసిన ‘పుష్ప 2’.. ఎందుకిలా జరుగుతోంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus