Rana, Harish Shankar: హరీశ్‌ శంకర్‌ కౌంటర్‌కి రానా సూపర్‌ పంచ్‌… ఏమైందంటే?

నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’లో స్పెషల్‌ ఎడిషన్‌ ఒకటి జరుగుతోంది. ఎప్పుడు ఎపిసోడ్‌ వస్తుంది అనే విషయంలో ఎలాంటి లెక్కలు, పట్టింపులు లేకుండా నచ్చినప్పుడు కొత్త ఎపిసోడ్‌ ఇస్తూ ‘లిమిటెడ్‌ వెర్షన్‌’ అని అంటున్నారు. అయితే ఇటీవల ఓ డిఫరెంట్‌ కాంబినేషన్‌తో ఓ ఎపిసోడ్‌ చేశారు. ఏ మాత్రం సంబంధం లేని నలుగురిని బాలయ్య ఎదుట కూర్చోబెట్టారు. అయితే వాళ్లందరికీ బాలయ్యతో అనుబంధం ఉంది. అయితే ఈ ఎపిసోడ్ బిట్‌ను ఆహా ట్వీట్‌ చేస్తే దాని కింద రానా ఓ కౌంటర్‌ ఇచ్చాడు.

‘అన్‌స్టాపబుల్‌’ కొత్త ఎపిసోడ్‌ చూసిన వాళ్లకు అందులో దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఎంతటి సందడి చేశారో తెలిసే ఉంటుంది. ఫిల్టర్‌ లేని సందడి అంటూ టీమ్‌ చెప్పినా… ఇందులో అందరికీ కౌంటర్లు, పంచ్‌లు పడ్డాయి. గత సీజన్‌లో ఓ ఎపిసోడ్‌ కోసం వచ్చిన రానా… బాలయ్యతో భార్య వసుంధరకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పించారు. ఆ విషయాన్ని హరీశ్‌ శంకర్‌ ప్రస్తావిస్తూ ‘భార్యకు ఐ లవ్‌ యూ చెప్పడం స్పెషలేం కాదని, మీతో అలా చేయించిన రానాను ఓ పీకు పీకాల్సింది అని అన్నారు.

అయితే, ఆ మాటకు అక్కడ షోలో ఉన్న ఎవరూ ఏమీ అనలేదు. అయితే ఆ మాట క్లిప్పింగ్‌ను ఆహా టీమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే దాని కింద రానా రిప్లై ఇచ్చారు. ‘నన్నుకాదు.. నిన్ను పీకాల్సింది’ అంటూ కామెంట్‌ పెట్టారు. రానా సరదాగా పెట్టారేమో కానీ.. అభిమానులు, నెటిజన్లు మాత్రం హరీశ్‌ శంకర్‌ సరైన కౌంటర్‌ పడింది అని కామెంట్లు చేస్తున్నారు. తనను ఎవరైనా ఏమైనా అంటే సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేసేసే (Harish Shankar) హరీశ్‌ శంకర్‌… ఇప్పుడు రానాను ఇలా ఎలా అంటారు అని అంటున్నారు.

అయితే, రానా ఆ మాట అన్నది సరదాగా కాబట్టి… అంత పట్టించుకోనక్కర్లేదు అని మరికొంతమంద నెటిజన్లు కామెంట్లు చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరి మీరూ ఆ కామెంట్ల చర్చ చూశారా?

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus