Rana: సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న రానా!

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన రానా, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏ సెంటర్లలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉండగా బీ, సీ సెంటర్లలో మాత్రం ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన విధంగా లేకపోవడం గమనార్హం. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా రానా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

రానా మాట్లాడుతూ అందరికీ వందనాలు అని చిన్నాన్న లేకుండా ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా ఎలాంటి శుభకార్యం జరగదని తెలిపారు. ఫ్లైట్ మిస్ కావడం వల్ల చరణ్ ఈవెంట్ కు రాలేకపోయాడని రానా కామెంట్లు చేశారు. దర్శకుడు వేణు భయంకరమైన బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన స్టోరీ తీశాడని రానా అన్నారు. సాయిపల్లవి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదని రానా చెప్పుకొచ్చారు. సాయిపల్లవితో పని చేయడం లక్ గా భావిస్తున్నానని రానా కామెంట్లు చేశారు.

తాను ఎముకలు విరగ్గొట్టుకోకుండా ఇంటికి వెళ్లిన సినిమా విరాటపర్వం అని రానా చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ కు తాను ఒక నిజం చెప్పాలని అనుకుంటున్నానని నాకు వెంకటేష్ గారి ఫ్యాన్స్ మాత్రమే ఉంటారని అనుకున్నానని రానా తెలిపారు. విరాటపర్వం సినిమాకు ఓకే చెప్పిన తర్వాతే నాకు ఫ్యాన్స్ ఉన్నారని తెలిసిందని రానా అన్నారు.

ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత చాలామంది ఎందుకు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావని నన్ను అడిగారని రానా చెప్పుకొచ్చారు. ఇకపై ఫ్యాన్స్ కు నచ్చినట్టే సినిమాలు చేస్తానని రానా అభిమానులకు మాటిచ్చారు. ఇకపై పిచ్చెక్కించేద్దాం అంటూ రానా కామెంట్లు చేశారు. రానా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus