Rana wife Miheeka: హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనీ మిహీక క్రేజ్.. ఏకంగా ఫోటో!

హలో మ్యాగజైన్ గురించి అందరికీ ఎంతో సుపరిచితమే ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై ఎంతో మంది సినీ సెలబ్రిటీల ఫోటోలను ప్రచురిస్తూ ఉంటారు. ఇలా ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ మ్యాగజైన్ పై ఎంతో మంచి ఆదరణ ఉన్నటువంటి సెలబ్రిటీల ఫోటోలు మాత్రమే ప్రచురితమవుతూ ఉంటాయి. తాజాగా ఈ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రముఖ నటుడు రానా సతీమణి మిహిక ఫోటో ప్రచురితమైనది. ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై ఫ్లోరల్ లెహంగాతో ఉన్నటువంటి ఫోటో ప్రచురితం కావడంతో అందరూ ఈమె గురించి సర్చ్ చేసారు

అయితే ఈమె ప్రముఖ నటుడు రానా భార్య అని తెలియడంతో ఆశ్చర్యపోతున్నారు. ఈ విధమైనటువంటి మ్యాగ్జైన్ పేజీపై కేవలం సినీ సెలబ్రిటీల ఫోటోలు మాత్రమే వస్తాయి. అలాంటిది మిహిక ఫోటో రావడంతో ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం అవుతుంది. మీహికా కేవలం రానా భార్య మాత్రమే కాకుండా ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఈమె ఇంటీరియర్ డిజైన్ గా గుర్తింపు పొందడమే కాకుండా వీరికి ఒక ఇంటీరియర్ డిజైనర్ కంపెనీ కూడా ఉంది.ఇలా బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.

ఇలా సోషల్ మీడియాలో అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడంతో (Miheeka) ఈమెకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా బిజినెస్ ఉమెన్ గా మాత్రమే కాకుండా ఈమె ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ తన మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. ఈ విధంగా హీరోయిన్లతో పాటు క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె ఫోటో ఏకంగా మ్యాగజైన్ కవర్ పేరు రావడంతో రానా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus