రానా దగ్గుబాటి హీరోగా నటించిన తాజా చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్ కీలక పాత్రలు పోషించారు. ‘ఈరోస్ ఇంటర్‌నేషనల్’ సంస్థ నిర్మించిన ఈ చిత్రం మార్చి26న అంటే రేపు విడుదల కాబోతుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది. నిజానికి గతేడాదే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది కానీ.. కొన్ని కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.
ఈ చిత్రం కోసం సుమారు రూ.60కోట్ల వరకూ బడ్జెట్ పెట్టాడు నిర్మాత. నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో ఇప్పటివరకూ రూ.35కోట్ల వరకూ రాబట్టినట్టు సమాచారం. అంటే థియేట్రికల్ రైట్స్ పరంగా రూ.25కోట్లన్న మాట. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా ఈరోస్ వారు ఈ చిత్రాన్ని ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారు. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.25.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే రేపు బంద్ ఎఫెక్ట్ ఉంది. దాంతో మార్నింగ్ షోలకు దెబ్బ పడినట్టే..!
అంతేకాకుండా పోటీగా నితిన్, కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. దాంతో ‘అరణ్య’ ఎంత వరకూ రాబడుతుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. టీజర్, ట్రైలర్ లు అద్భుతంగా ఉన్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈరోజు సాయంత్రం నుండీ ప్రీమియర్లు కూడా వేస్తున్నారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటనేది స్పష్టమవుతుంది. హోలీ సెలవు కూడా ఉండడం ఒక అడ్వాంటేజ్..!
Most Recommended Video
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!