Leader Movie: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడిని క్యాష్‌ చేసుకునే ప్రయత్నం.. రానా సినిమా రీరిలీజ్‌!

  • September 16, 2023 / 08:55 PM IST

సినిమాలు – రాజకీయాలు… ఈ రెండూ అవిభక్త కవలలు లాంటివి. రెండిటినీ వేరుగా చూడలేం అంటుంటారు. సినిమాల్లో చూపించిందని రాజకీయాల్లో జరుగుతుంది, లేకపోతే జరిగి ఉంటుంది కూడా. సినిమాల్లో ఆరితేరిన నటులు రాజకీయాల్లోకి వస్తుంటారు కూడా. రాజకీయాల్లో వేడి రాజుకున్నప్పుడు కొన్ని సినిమాలు క్యాష్‌ చేసుకుంటూ ఉంటాయి. ఆ పరిస్థితులకు తగ్గట్టు సినిమాలు చేస్తుంటారు. అయితే ఈ రీరిలీజ్‌ల కాలంలో ఓ పాత పొలిటికల్‌ హీట్‌ మూవీ ఇప్పుడు రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది.

రానాను హీరోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం ‘లీడర్‌’. అవినీతి బురదలో దాదాపు కూరుకుపోయిన ఓ రాజకీయ నాయకుడు తనయుడు అతని స్థానంలోకి వస్తే… అతని నీతికి, నిజాయతికి రూపమైతే ఎలా ఉంటుంది. ఎలా రాజకీయం చేశాడు, ప్రజలకు మేలు ఎలా చేశాడు, అనేది ఆ సినిమా కథ. ఆ సినిమాలో చూపించిన చాలా విషయాలు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి, జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. అలాంటి అంశాలతో మన దగ్గర సినిమాలు కూడా వచ్చాయి. అందులో ఒకటి ‘లీడర్‌’.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ భారీగా ఉంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏసీ సీఐడీ అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని చూస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో జరిగిన ఈ మొత్తం ఘటనల్లో ఎవరిది తప్పు అనేది తేలకపోయినా చంద్రబాబు అయితే వారం నుండి జైలులో ఉన్నారు. ఈ పొలిటికల్‌ హీట్‌ని క్యాష్‌ చేసుకోవడానికి ‘లీడర్‌’ సినిమాను రీరిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట.

త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో రిలీజ్‌కి ఏపీలో కొన్ని సినిమాలు రెడీగా అవుతున్నాయి. నారా రోహిత్ ‘ప్రతినిథి 2’ సిద్ధం చేస్తుంటే… మహి వి రాఘవ్ ‘యాత్ర 2’ చేస్తున్నారు. సెటైరికల్‌ కాన్సెప్ట్‌తో రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’తో వస్తున్నారు. అవి ఇంకెంత హీట్‌ పెంచుతాయో చూడాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags