Ranbeer, Alia Bhatt: మొదటి భార్య గురించి అసలు విషయం బయటపెట్టిన రణబీర్!

బాలీవుడ్ క్రేజీ కపుల్స్ రణబీర్ అలియా జంట గురించి మనకు తెలిసిందే. వీరిద్దరూ ఏప్రిల్ 14వ తేదీ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.అయితే వీరి పెళ్ళి జరిగినప్పటికీ వీరి సినిమాలతో ప్రస్తుతం వీరిద్దరు సినిమా షూటింగులు, ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈయన నటించిన బ్రహ్మాస్త్రం సినిమా త్వరలోనే విడుదల కానుండటంతో పెద్దఎత్తున ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా రణబీర్ నటించిన ‘షంషేరా’ ట్రైలర్ విడుదలవుతూ అభిమానులలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇలా ఈ రెండు సినిమాల పై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. అలియా తన మొదటి భార్య కాదని తనను తన రెండవ పెళ్లి చేసుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ఇలా ఒక్కసారిగా పెళ్లి గురించి గందరగోళమైన మాటలు మాట్లాడటంతో అసలేం జరిగిందని ఆలోచనలో పడ్డారు.

యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో అయినటువంటి రణబీర్ కి విపరీతమైన అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని సంవత్సరాల క్రితం రణబీర్ తన కుటుంబంతో కలిసి కృష్ణరాజ్‌ బంగ్లాలో ఉండేవారట, ఓ అమ్మాయి ఆ ఇంటి ముందుకు వచ్చి తన ఇంటి గేట్ తో వివాహం చేసుకుని అప్పటి నుంచి రణబీర్ నా భర్త అంటూ ఫీలవుతుందని అయితే ఇప్పటి వరకు నేను నా మొదటి భార్యను కలుసుకోలేదని తెలిపారు.

ఆ సమయంలో నేను ఇంట్లో లేకపోవడంతో పురోహితుడిని తీసుకొచ్చి ఆమె తన ఇంటి గేటుకు బొట్లు పెట్టి పూలమాల వేసి పెళ్లి చేసుకుందని వాచ్మెన్ చెప్పే సరికి ఒక్కసారిగా షాక్ అయ్యాను. అయితే ఇప్పటివరకు తాను తన మొదటి భార్యను కలవలేదని , ఏదో ఒక సమయంలో తనని కలుస్తానని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా రణబీర్ పెళ్ళి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus