Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..
- April 1, 2026 / 06:51 PM ISTByFilmy Focus Desk
‘రామాయణ’ సినిమా గురించి ఆ మధ్య తెగ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పెద్దగా మాట్లాడింది లేదు. తొలి భాగం షూటింగ్ అయిపోయింది.. దీపావళికి సినిమా రిలీజ్ చేసినప్పుడు మాట్లాడుతారులే అనుకున్నారంతా. అయితే ఇప్పుడు మరో సందర్భం వచ్చింది. అందుకే ఆ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. ‘రామాయణ’ సినిమా గ్లింప్స్‌ను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో లాస్ ఏంజిలెస్‌లోని ఐమాక్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. అప్పుడు మీడియా ముందుకొచ్చింది టీమ్. అలా మాట్లాడినప్పుడు రాముడి పాత్ర కోసం రణ్‌బీర్ ఆలోచనలు ఎలా సాగాయో తెలిసింది.
Ranbir Kapoor
రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతు చిత్రం ‘రామాయణ’. రెండు భాగాలు రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఆయన ఈ పాత్ర గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. రాముడి పాత్ర కోసం చిత్రబృందం సంప్రదించినప్పుడు తొలుత తిరస్కరించినట్లు చెప్పాడు. నాలుగేళ్ల క్రితం నిర్మాత నమిత్ మల్హోత్రా నాకు ఈ పాత్రను ఆఫర్ చేసినప్పుడు ‘నో’ చెప్పానన్నాడు. అయితే కుమార్తె రాహా కోసం ఈ పాత్రను అంగీకరించినట్లు తెలిపాడు.

రాముడి పాత్రకు న్యాయం చేసేంత సామర్థ్యం తనకు లేదని, దానికి తాను తగినవాడిని కాదని అనుకున్నానని అన్నాడు. కానీ, రాహా తన ఆలోచన విధానాన్ని మార్చేసిందన్నాడు. ఒక తండ్రిగా తన బాధ్యతలను తెలుసుకున్న తర్వాత, శ్రీరాముడి వంటి ఆదర్శవంతమైన పాత్రను పోషించడం వ్యక్తిగత ఎదుగుదలకూ సహాయపడుతుందని అనుకున్నానని భావించినట్లు తెలిపారు. అలాంటి పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పాడు.
ఇక ‘రామాయణ’ గ్లింప్స్ 2.38 నిమిషాలు ఉండనుంది. ఇందులో సినిమా ప్రధాన పాత్రల లుక్స్‌ను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు సమాచారం. తొలి పార్ట్ ఈ దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్న విషయం తెలిసిందే.











