Ranbir Kapoor: ఆ హీరో కోసం రణబీర్ స్పెషల్ సాంగ్!
- September 24, 2021 / 03:46 PM ISTByFilmy Focus
బాలీవుడ్ లో స్టార్ హీరోగా చెలామణి అవుతోన్న రణబీర్ సింగ్ థియేటర్లలో సందడి చేసి చాలా కాలమవుతుంది. ఆయన నటించిన ‘సంజు’ సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటినుంచి రణబీర్ సినిమాలేవీ కూడా రిలీజ్ కాలేదు. ఆయన నటించిన ‘శంషేరా’, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఎప్పుడు విడుదల కానున్నాయనే విషయంలో క్లారిటీ లేదు.
ఇదిలా ఉండగా.. అభిమానులు ఇప్పుడు రణబీర్ ను ఓ ఐటెం సాంగ్ లో చూసే అవకాశం ఉందని సమాచారం. బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. విక్కీ కౌశల్ నటిస్తోన్న ‘మిస్టర్ లేలే’ సినిమాలో రణబీర్ స్పెషల్ సాంగ్ లోనటించబోతున్నాడట. ముందుగా ఈ స్పెషల్ సాంగ్ కోసం సల్మాన్ ఖాన్ ను సంప్రదించగా.. ఆయన రణబీర్ ను సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రణబీర్ ను ఇందులో నటించమని అడగ్గా.. ఆయన వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.

దీనికోసం భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. మెహబూబ్ స్టూడియోస్ లో ఈ ఐటెం సాంగ్ ను చిత్రీకరించనున్నారు. గణేష్ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేయనున్నారు. గతంలో ‘చిల్లర్ పార్టీ’ అనే సినిమాలో రణబీర్ ఇలాంటి స్పెషల్ సాంగ్ లో నటించాడు. మళ్లీ ఇంతకాలానికి మరో సాంగ్ లో నటించడానికి అంగీకరించాడు.
లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!














