బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణబీర్ కపూర్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమకి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నారు. నిజానికి ఈ ఏడాదిలోనే అలియాని పెళ్లి చేసుకోవాలని భావించినట్లు.. కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ వెల్లడించాడు. ఇదిలా ఉండగా.. ఈరోజు ఈ జంటకి ఎంగేజ్మెంట్ జరగబోతుందని సమాచారం.
మంగళవారం నాడు రణబీర్ కపూర్ ఫ్యామిలీ, అలియా భట్ ఫ్యామిలీ అందరూ కలిసి రాజస్థాన్ కి వెళ్లారు. న్యూఇయర్ వెకేషన్ కోసం వెళ్లి ఉంటారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు అదే ప్రాంతానికి రణబీర్ కి, అలియాకి సన్నిహితులైన చాలా మంది సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. అందరూ కలిసి రాజస్థాన్ లోని అమన్ హోటల్ లో స్టే చేస్తున్నారు. దీంతో ఇది వెకేషన్ కాదని.. రణబీర్, అలియాల నిశ్చితార్ధం జరిపించడానికి అందరూ ఒక చోటుకి చేరుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈరోజు (డిసెంబర్ 30)న రాజస్థాన్ లోని రత్నంబోర్ నేషనల్ పార్క్ లో వీరి ఎంగేజ్మెంట్ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ప్రస్తుతం అలియా బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతోంది. అలానే రాజమౌళి రూపొందిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తోంది.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!