Ranbir Kapoor: భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రణ్ బీర్.. ఏం జరిగిందంటే?

రణ్ బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా రణ్ బీర్ కపూర్ ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో ట్రైలర్ ను చూస్తుండటం గమనార్హం. సాధారణంగా సాఫ్ట్ అయిన రణ్ బీర్ కపూర్ యానిమల్ మూవీలో వయొలెంట్ రోల్ లో నటించారు. ఈ సినిమా రోల్ గురించి రణ్ బీర్ మాట్లాడుతూ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమాలో తాను పాత్రలతో డిటాచ్ గా ఉంటానని రణ్ బీర్ అన్నారు. అలాంటి రోల్ తనను ప్రేమించే వారిపై మంచి ప్రభావం చూపించదని ఆయన కామెంట్లు చేశారు. నేను ఇంటికి వెళ్లి యానిమల్ సినిమాలోని హీరో పాత్రలా ప్రవర్తిస్తే మాత్రం నా భార్య నన్ను కొడుతుందని రణ్ బీర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి రణ్ బీర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు. త్వరలో రణ్ బీర్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. రణ్ బీర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం భారీ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం రికార్డ్ స్థాయి థియేటర్లలో యానిమల్ మూవీ రిలీజ్ కానుందని తెలుస్తోంది. యానిమల్ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబో మూవీ షూటింగ్ 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో మొదలుకానుంది. ఈ సినిమా 2026 సంవత్సరంలో థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. వేగంగా సినిమాలను తెరకెక్కించడం కంటే క్వాలిటీ సినిమాలను తెరకెక్కించడంపై సందీప్ రెడ్డి వంగా ఫోకస్ పెడుతుండటం గమనార్హం. రణ్ బీర్ కపూర్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus