‘రంగమార్తాండ’ ప్రీమియర్ షో టాక్.. ఎలా ఉందంటే?

సీనియర్ స్టార్ డైరెక్టర్స్ లో కృష్ణవంశీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఏ స్టార్ డైరెక్టర్ సినిమా చూసినా అది థియేటర్లో కూర్చున్నంత వరకు మాత్రమే ఆ సినిమాని ఆస్వాదిస్తాం. థియేటర్ నుండి బయటకు వెళ్లిన తర్వాత ఆ సినిమాలో మనల్ని ఎంటర్టైన్ చేసిన అంశాలనే గుర్తుపెట్టుకుంటాం. కానీ కృష్ణవంశీ తీసిన సినిమాలు చూస్తున్నప్పుడు మనం ప్రేక్షకుడిలా కాకుండా తెరపై జరుగుతున్న కథలో మనం కూడా ఓ భాగమేమో అనేంతలా కథలో లీనమైపోతాం. థియేటర్ నుండి బయటకు వెళ్లిన తర్వాత కూడా ఆ కథ మొత్తం మనల్ని వెంటాడుతుంది.

కొన్ని పాయింట్లు మనల్ని ప్రశ్నిస్తాయి.’సింధూరం’ సినిమా ఎంత మంది థియేటర్లలో చూశారో తెలీదు. కానీ చూసిన వాళ్ళు మాత్రం ఇప్పటికీ ఆ సినిమా జ్ఞాపకాలను ఇంకా నెమరువేసుకుంటూనే ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. 1990 లలోనే కృష్ణవంశీ చాలా అడ్వాన్స్డ్ గా ఆలోచించేవాడు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో మొహాలు చూసుకునే ల్యాండ్ ఫోన్లు ఉంటాయని చాలా మందికి తెలీదు. అది చూపించిన మొట్ట మొదటి దర్శకుడు కృష్ణవంశీనే..! ఆ సినిమా చూసిన వారు కుటుంబం అంటే ఇంత అందంగా ఉంటుందా అనుకుంటారు.

‘మురారి’ చూస్తే బంధాలు, భావోద్వేగాలను ఎంత చక్కగా ఆవిష్కరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘చందమామ’ సినిమా చూస్తే ఓ పండుగ రోజుల్లో గడుపుతున్న ఫీలింగ్. అంతేకాదు కృష్ణవంశీ సినిమాల్లో వినసొంపైన సంగీతం ఉంటుంది. అయితే తర్వాత కృష్ణ వంశీ సినిమాల్లో అవి మిస్ అయ్యాయి అనే బాధ అందరికీ ఉండి ఉంటుంది. అలాంటి వారు ‘రంగమార్తాండ’ సినిమా చూస్తే తప్పకుండా సంతృప్తి చెందుతారు అనడంలో అతిశయోక్తి లేదు. అంత గట్టి నమ్మకం ఉంది కాబట్టే.. తాజాగా 100 మందిని పిలిచి మరీ ప్రీమియర్ వేశాడు కృష్ణవంశీ. అది కూడా సెన్సార్ కాని సినిమాకి..!

ఈ సినిమాకి థియేటర్ కు వెళ్లి కూర్చునే జనాలకు మొదట ఒక ఫీలింగ్ ఉండొచ్చు. ‘కృష్ణవంశీ ఫేడౌట్ అయిపోయాక ఏం గొప్పగా తీస్తాడులే’ అనే ఫీలింగే అది. కానీ సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ పోతుంది. ఇది కదా కృష్ణ వంశీ సినిమా నుండి మనం కోరుకునేది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది రీమేక్ సినిమానే అయినా ‘నట సామ్రాట్’ సోల్ ను కృష్ణవంశీ మిస్ చేయలేదు. నటీనటుల పనితీరు కూడా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ ఉన్నాడు కదా అని అతనికే సినిమాలో అగ్రపీఠం వేయలేదు.

చక్రి పాత్ర పోషించిన బ్రహ్మానందం ఆయనకు మించి నటించాడు. హాస్పిటల్ లో ఉండే సన్నివేశం చాలా బాగా రాసుకున్నాడు. సంభాషణలు చాలా సహజంగా ఉన్నాయి. రమ్య కృష్ణ – ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టిపడేస్తాయి. పాటలు, సినిమాటోగ్రఫీ ఇలా ఎందులో చూసుకున్నా ఏమి తక్కువ కాలేదు అనిపిస్తుంది. ఫైనల్ గా ‘రంగమార్తాండ’ తప్పకుండా ఓ మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది. మంచి సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది అని ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు. ‘రంగమార్తాండ’ తో ఈ విషయం మరోసారి ప్రూవ్ అవుతుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus